వేసవి(Summer) వచ్చిందంటే చాలా మంది ఎక్కడికైనా పర్యటనకు వెళ్లాలనుకుంటారు. ఎక్కువగా చల్లని ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. విదేశాలకు వెళ్లలేని వారు భారత్‌లోనే ఉన్న సుందరమైన ప్రదేశాలకు వెళ్తారు. గోవా(Goa), లడక్(Ladak) వంటి ప్రాంతాలకు ఈ సమ్మర్లో వెకేషన్ ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికి ఓ అద్భుతమైన నిర్మాణం సిద్ధమైంది.
భారత్(Bharath) లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన లడక్‌లో అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. సముద్ర మట్టానికి ఏకంగా 14వేల అడుగుల ఎత్తులో నిర్మించిన ఐస్ కేఫ్(Ice Cafe) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కేఫ్ ఇప్పుడు భారత్‌లో మొట్టమొదటిగా నిలిచింది. పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఐస్ కేఫ్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇటీవలే అద్భుతమైన దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ కేఫ్‌లో సంప్రదాయ నూడుల్స్, వివిధ రకాల వేడి పానీయాలు అందిస్తున్నారు. పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న ఈ కేఫ్ ఇంతకుముందు కనీవినీ ఎరుగని రీతిలో నిర్మించారు. పర్యాటకులు ఈ కేఫ్‌ను సందర్శించిన తర్వాత మంచి అనుభూతిని పొందుతారు.
కృత్రిమ, సహజమైన మంచు గడ్డలతో తయారు చేయగా ఇది కరిగిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన చర్యలను తీసుకున్నారు. ఈ కృత్రిమ, సహజమైన హిమానీనదం మంచు గడ్డలతో తయారు చేశారు. ఈ మంచు గడ్డలు కరిగిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన చర్యలను తీసుకున్నట్లు కేఫ్ నిర్వాహకులు తెలిపారు.
🚨 India’s first ice cafe at 14000 feet in Ladakh. 🇮🇳 pic.twitter.com/AIALngPuEj
— Indian Tech & Infra (@IndianTechGuide) April 6, 2024