కెనడా -భారత్ మధ్య దౌత్య పరమైన వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కెనడా రక్షణ శాఖ మంత్రి (Defence Minister) బిల్ బ్లేయిర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ (India) తో సంబంధాలు తమకు అత్యంత ముఖ్యమైన (Important) వని పేర్కొన్నారు. భారత్ తో సంబంధాలకు సంబంధించి ఇది అత్యంత సవాలుతో కూడుకున్న సమస్య అని ఆయన వెల్లడించారు.
అదే సమయంలో ఈ విషయంపై తాము సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పారు. ఈ అంశంలో వాస్తవాలను వెలికి తీసేలా చూసుకోవాల్సిన బాధ్యత తమపై వుందని తెలిపారు. ఒక వేళ భారత్ పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే అది చాలా ఆందోళనకర అంశంగా మారుతుందన్నారు. తమ గడ్డపై తమ పౌరున్ని హత్య చేయడం ఖచ్చితంగా తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.
మరోవైపు ఖలిస్తాన్ ఉగ్రవాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్రూడోపై ఆయన పరోక్ష విమర్శలు గుప్పించారు. స్వేచ్ఛ పేరుతో ఎలానైతే చాలా పనులు జరుగుతున్నాయో అదే విధంగా మార్కెట్ పేరుతోనూ చాలా పనులు జరుగుతాయని అన్నారు.
ఇటీవల కెనడాలోని సర్రే ప్రాంతంలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక భారత ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు భారత దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్టు వెల్లడించారు. దీంతో భారత్ దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కెనడా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొంది. కెనడా దౌత్య వేత్తను బహిష్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఐదు రోజుల్లోగా భారత్ ను విడిచి వెళ్లి పోవాలని కెనడా దౌత్య వేత్తకు కేంద్రం సూచించింది.