Telugu News » Ilayarajaja Biopic: ఇళయరాజా బయోపిక్ ఫిక్స్‌.. హీరో ఎవరంటే..?

Ilayarajaja Biopic: ఇళయరాజా బయోపిక్ ఫిక్స్‌.. హీరో ఎవరంటే..?

ఇళయరాజా బయోపిక్(Ilaiyaraaja Biopic) తీయాలనే ఆలోచన బాలీవుడ్‌ దర్శకుడు ఆర్‌ బాల్కీకి (R balki) తట్టింది. ఈ విషయాన్ని గత సంవత్సరం ఓ సందర్భంలో ఆయన వెల్లడించారు. ఇళయరాజా పాత్రలో ధనుష్‌ని చూడాలనుకుంటున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు.

by Mano
Ilayarajaja Biopic: Ilayaraja biopic fix.. Who is the hero..?

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు (Ilaiyaraaja) సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఆయన జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనున్నట్లు కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదేవార్త మరోసారి తెరపైకి వచ్చింది.

Ilayarajaja Biopic: Ilayaraja biopic fix.. Who is the hero..?

ఇళయరాజా బయోపిక్(Ilaiyaraaja Biopic) తీయాలనే ఆలోచన బాలీవుడ్‌ దర్శకుడు ఆర్‌ బాల్కీకి (R balki) తట్టింది. ఈ విషయాన్ని గత సంవత్సరం ఓ సందర్భంలో ఆయన వెల్లడించారు. వ్యక్తిగత, సంగీత జీవితాన్ని కథగా మలిచి చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. ఇళయరాజా పాత్రలో ధనుష్‌ని చూడాలనుకుంటున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీని పట్ల ధనుష్‌ కూడా ఆసక్తికరంగా ఉన్నట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం కానుందని, 2025లో సినిమాను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. ఇందుకు సంబంధించి వరుస కథనాలు అక్కడ వెలువడుతున్నాయి. అంతా అనుకున్నట్లే జరిగితే కనెక్ట్‌ మీడియా ప్రొడక్షన హౌస్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా ఆలోచన బయటపెట్టిన ఆర్‌.బాల్కీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారా? లేక మరొకరితో చేయిస్తారా? అనేది తెలియాల్సివుంది. గతంలో ఆర్‌ బాల్కీ ధనుష్‌తో షమితాబ్‌ చిత్రం తీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే!

You may also like

Leave a Comment