జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో(JNU) నిర్వహించిన స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీ(Left parties)ల అనుబంధ విద్యార్థి సంఘాలు విజయం సాధించాయి. జేఎన్‌యూ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 4 పోస్టులకు ఇటీవల ఎన్నిలు జరిగాయి. అయితే, కోవిడ్ విరామం తర్వాత నాలుగు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించడం గమనార్హం.
ఈ ఎన్నికల్లో యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్.. అఖిత భారత విద్యార్థి పరిషత్ (ABVP)ని స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడించి నాలుగు సీట్లను కైవసం చేసుకుంది. అయితే, ఈసారి ఎన్నికల్లో ఏబీవీపీని ఢీకొట్టేందుకు లెఫ్ట్ పార్టీలకు చెందిన అనుబంధ విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి ఒక ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి.
ఇందులో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్(DSF), స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SFI), ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (AISF)లు కూటమిగా ఏర్పడి యునైటెడ్ లెఫ్ట్ ఫ్ర్ంట్గా అవతరించాయి.
అయితే, ఓట్ల లెక్కింపు సందర్భంగా తొలుత ఏబీవీపీ దూకుడుకు కనబరించింది. ఆ తర్వాత నెమ్మదిగా లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యంలోకి వచ్చింది. ఏబీవీపీ అధ్యక్ష పదవి అభ్యర్థి ఉమేష్ చంద్రకు 2,118 ఓట్లు పోలవ్వగా.. లెఫ్ట్ అభ్యర్థి ధనుంజయ్‌కు 3,100 ఓట్లు వచ్చాయి. ప్రెసిడెంట్‌గా ధనుంజయ్, వైస్ ప్రెసిడెంట్‌గా అవిజిత్ షోష్, జనరల్ సెక్రటరీగా ప్రియాంషి ఆర్య, జాయింట్ సెక్రటరీగా మో సాజిత్ విజయం సాధించారు.కాగా, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ పార్టీకి జేఎన్‌యూ ఫలితాలు పరీక్ష పెట్టబోతున్నాయా? అనేది తెలియాల్సి ఉంది.