భారత్ అభివృద్ధి గురించి దాయాది పాకిస్తాన్(Pakistan) పార్లమెంటులో చర్చ జరిగింది. ఇంతకాలం పొరుగున ఉన్న పాక్.. మనదేశంలోనికి ఉగ్రవాదులను ఎగదోసేది. ఈ మధ్యకాలంలో పాక్ సరిహద్దుల గుండా పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు డ్రోన్ల ద్వారా భారత భూభాగంలోకి వస్తున్నాయి. వీటిని అరికట్టడానికి భారత భద్రతా బలగాలు ఎంతో శ్రమిస్తున్నాయి. ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370, అధికరణ 35(A) రద్దు తర్వాత ఆ ప్రాంతం ప్రస్తుతం అభివృద్ధిలో దూసుకుపోతోంది.
టూరిజం పరంగాను అక్కడ ఎక్కువగా మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం(Indian Government) కల్పిస్తోంది. ఇక ఆర్థిక, రక్షణ, జనాభా పరంగాను భారత్(Bharath) ఎంతో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ క్రమంలోనే పాక్, చైనాతో కలిసి ఇండియాను దెబ్బతీయాలని ఎంత ప్రయత్నించినా అవేమి సక్సెస్ కాలేదు. ఫలితంగా పాకిస్తాన్ దారుణమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆ దేశం దారుణమైన అప్పుల్లో కూరుకుపోయింది. పాకిస్తాన్ అలా కావడానికి ఆ దేశ నాయకులే కారణమని స్వయంగా పాక్ ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇదివరకు పాక్‌ను పాలించిన నేతలంతా దారుణమైన అవినీతికి పాల్పడటంతో ఆ దేశం దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటోంది.ప్రజల కనీస సౌకర్యాలు, నిత్యావసరాలు కూడా తీర్చలేని స్థితిలో పాకిస్తాన్ ఉన్నది. కాగా, ఇటీవల పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.
ప్రస్తుతం ఆ దేశంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పాక్ మంత్రి మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్(pak minister moulana Fazur Rehman) ఆ దేశ పార్లమెంటులో భారత్‌ను మెచ్చుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌కు మనకు ఓకేసారి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ, వాళ్లు ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు. మనం దివాలా తీసే క్రమంలో ఉన్నాం. భారత్ ప్రపంచంలోనే సూపర్ పవర్ శక్తిలా ఎదుగుతోంది. కానీ, మనం దివాలా తీయకుండా ఉండేందుకు ఐఎంఎఫ్ (IMF)ను ఆర్థికసాయం చేయాలని అడుక్కుంటున్నాం’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.