దేశంలో కరోనా (corona) కేసులు పెరిగి పోతున్నాయి. తాజాగా దేశంలో 800కు చేరువలో కొత్త కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. దేశంలో తాజాగా 797 కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. దేశంలో యాక్టివ్ కేసుల (Active Cases) సంఖ్య 4091గా ఉన్నట్టు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఐదుగురు మరణించినట్టు పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకి కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,33,351కు చేరకుంది. దేశంలో ఇప్పటి వరకు 145 జేఎన్-1 వేరియంట్ కేసులు నమోదైనట్టు అధికారులు చెప్పారు.
అందులో అత్యధికంగా కేరళలో 41 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుజరాత్ లో అత్యధికంగా 36, కర్ణాటక 34, గోవా 14, మహారాష్ట్ర 9, రాజస్థాన్, తమిళనాడులల్లో నాలుగు, తెలంగాణలో రెండు, ఢిల్లీలో ఒక ఎన్ జే1 కరోనా కేసు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ….
దేశ రాజధానిలో జేఎన్ 1 సబ్-వేరియంట్‌తో బాధపడుతున్న 50 ఏళ్ల వ్యక్తి కోలుకున్నారన్నారు. ప్రస్తుతం నగరంలో వేరియంట్‌కు సంబంధించిన యాక్టివ్ కేసులేవీ లేవని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్కులు ధరించాలని సూచించారు.