Telugu News » షర్మిల కి కాబోయే కోడలు అట్లూరి ప్రియ చంద్రబాబు బంధువా..?

షర్మిల కి కాబోయే కోడలు అట్లూరి ప్రియ చంద్రబాబు బంధువా..?

by Sravya

వైయస్ షర్మిల కొడుకు రాజారెడ్డికి పెళ్లి కుదిరింది. త్వరలోనే నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నారు. వైయస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎప్పటి నుండో వస్తున్నాయి అయితే నిజంగానే వార్తలు వచ్చినట్లే అట్లూరి ప్రియతో రాజారెడ్డి ప్రేమలో ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అయితే వైఎస్ షర్మిల కి కాబోయే కోడలు అయిన అట్లూరి ప్రియ గురించి అంతా ఆరా తీయడం మొదలుపెట్టారు. గూగుల్లో కూడా వెతుకుతున్నారు. వైయస్ షర్మిల కి కాబోయే కోడలు బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

YS Sharmila: YS Sharmila's son's wedding fix.. Where is the venue..?

షర్మిలకు కాబోయే కోడలు అట్లూరి ప్రియ చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలు అని ప్రచారం జోరుగా సాగింది అయితే నిజంగా ఈమె అట్లూరి ప్రసాద్ మనవరాలు కాదట. తాజాగా అట్లూరి ప్రియ కి సంబంధించిన విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. ఆమె బ్రదర్ అనిల్ స్నేహితుడైన అట్లూరి శ్రీనివాస్ మాధవి దంపతుల కూతురు. అమెరికాలో సెటిల్ అయిన అట్లూరి శ్రీనివాస్ అక్కడ బ్రదర్ అనిల్ కి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఆయనే పర్యవేక్షిస్తారట.

Also read:

ఇలా ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు ఉండడంతో రాజారెడ్డి ప్రియ మధ్య ప్రేమ చిగురించింది. అట్లూరి ప్రియ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. జగన్ ని శత్రువుగా భావించే సామాజిక వర్గం నుండి షర్మిల కోడలుగా తెచ్చుకోవడం సంచలనంగా మారిపోయింది ఇది ఇలా ఉంటే కొంతమంది అట్లూరి ప్రియ చంద్రబాబుకి బంధువు అవుతారని కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది షర్మిల జగన్ ని కాదని బయటికి వెళ్లినప్పుడే బంధం తెగిపోయింది అని ఈ విషయం గురించి ఇంతలా ఆలోచించాల్సిన అవసరమే లేదని కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు పైగా అట్లూరి ప్రియ కి చంద్రబాబు కి ఎటువంటి బంధుత్వం కూడా లేదని కూడా కామెంట్లు చేస్తున్నారు కావాలని సోషల్ మీడియాలో ప్రియ కి సంబంధించి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు.

 

You may also like

Leave a Comment