ఊపిరి ఆగిపోతే మనిషి జీవితం అక్కడితో ఆగిపోతుంది. ఉచ్ఛ్వాశ నిశ్వాసలు (Exhalation breaths) చక్కగా సాగితేనే జీవితం కొనసాగుంది. శ్వాసతో మనసుని, శరీరాన్నీ అనుసంధానించడం వల్ల అద్భుతాలు జరుగుతాయంటున్నారు నిపుణులు.
ప్రాణాయామం అన్నా, శ్వాస మీద ధ్యాస అని చెప్పినా , ధ్యానమనుకున్నా, యోగా అన్నా ఏ పేరుపెట్టినా అన్నీ కూడా శ్వాసను నియంత్రించడం అనే బేసిక్ కాన్సెప్ట్ మీద బిల్డ్ అయినవే.
కొన్ని సింపుల్ టెక్నిక్స్ తో వర్షాకాలంలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కు చెక్ పెట్టొచ్చట. అసలు రైనీ సీజన్ లో వచ్చే శారీరక సమస్యలేంటి..?! శ్వాసను కంట్రోల్ చేయడం ద్వారా వాటిని ఎలా కంట్రోల్ చొయ్యొచ్చో తెలుసుకుందాం.
వర్షం కారణంగా వాతావరణం నిమిషానికి ఒకలాగ మారుతుంది. దీన్నీ బట్టి మనిషి మూడ్ కూడా మారిపోతుంది.దీంతో కొంతమందికి లేజీగా అనిపించడం, నీరసంగా అనిపించడం, ఉన్నచోటే ఉండాలనిపించడంతో చురుకుదనం తగ్గిపోయి లైఫ్ ఒక చోట లాక్ అయిపోతుంది.
ఈ టైమ్ లో మనసు చెప్పిన మాట వింటే శారీరక శ్రమ తగ్గింపోతుంది.ఆ ఎఫెక్ట్ ఆరోగ్యం మీద పడిపోతుంది. అయితే ఒక ప్రాణాయామం మనం చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది.
నాడిశోధనా ప్రాణాయామ : ఈ ప్రాణాయామం మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే నాడీ వ్యవస్థను శాంత పరుస్తుంది. దీని రెగ్యులర్ అభ్యాసం అధిక రక్తపోటు(blood pressure), నిద్రలేమి(Insomnia), మైగ్రేన్(Migraine), ఒత్తిడి, కోపం, మానసిక రుగ్మతల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
అలాగే ఇది సహనం, మానసిక ప్రశాంతత, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, ఏకాగ్రతను పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇదెలా అంటే.. మీరు మీ వెన్నెముక(spine) నిటారుగా, భుజాలు సడలించి పద్మాసన స్థితిలో కూర్చోండి.
ఇప్పుడు మీ కుడి బొటన వేలితో మీ కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేసి, ఎడమ ముక్కు రంధ్రం ద్వారా లోతైన శ్వాస తీసుకోండి. తర్వాత కుడి నాసికా రంధ్రం ద్వారా నిదానంగా శ్వాస వదలాలి. అప్పుడు మీ కుడి చేతి ఉంగరపు వేలితో మీ ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేసి, కుడి నాసికా రంధ్రం ద్వారా లోతైన శ్వాస తీసుకోండి.
అలాగే ఎడమ నాసికా రంధ్రం ద్వారా ఊపిరి పీల్చుకోండి. ఈ ప్రాణాయామం 4 నుండి 5 నిమిషాలు చేయండి. ఇది సోమరితనం నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.
ఈ ప్రాణాయామం శరీరంలోని టాక్సిన్స్(Toxins)ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. శ్వాసను సులభతరం చేయడానికి మరియు శరీరానికి శక్తినివ్వడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది.
అలాగే ఈ ప్రాణాయామం అలసటను తగ్గించి శరీరాన్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ ప్రాణాయామం చేయడానికి పద్మాసన స్థితిలో కూర్చుని ఆపై మీకు నచ్చిన భంగిమలో మీ చేతులను మీ మోకాళ్లపై ఉంచండి.
ఇప్పుడు లోతైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి. దీన్ని కనీసం 20 నుంచి 30 సార్లు రిపీట్ చేయండి. ఈ ప్రాణాయామం మీ సోమరితనాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
ఇలా క్రమం తప్పకుండా ప్రాణాయామం, యోగాభ్యాసం చేయడం వల్ల సోమరితనం తొలగిపోవడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.మరింకెందుకు ఇలా చేసి …అలా యాక్టీవ్ అవ్వండి.