ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ (RTC MD SAJJANNAR) సోషల్ మీడియాలో (Social Media)చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన రెగ్యులర్‌గా ట్రాఫిక్ రూల్స్, వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓవర్ స్పీడ్ వలన జరిగే ప్రమాదాల గురించి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ఆయన పెట్టే పోస్టులు అందరినీ ఆకర్షిస్తుంటాయి, ఆలోచింపజేస్తాయి.
తాజాగా ఆయన సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ప్రస్తుతం అది కాస్త తెగ వైరల్ అవుతోంది. వాహనాన్ని నడిపే క్రమంలో చిన్నారుల పట్ల తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారో తెలిపే విషయం ఇది. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధ కలుగుతుందని సజ్జన్నార్ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు.
మండుటెండలో ఒక్క బైక్ పై ఇంత మందా!?
ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరమైన ఇలాంటి బైక్ ప్రయాణం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. చిన్నారుల విషయంలో కొందరు తల్లిదండ్రులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవరించడం బాధాకరం.@MORTHIndia @Team_Road_Squad @HiHyderabad @YakaswamyChalla #RoadSafety #TrafficRules… pic.twitter.com/TufFMFJ0BS
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 24, 2024
‘ఏడుగురితో ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం!’ అంటూ ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనం(paper clip)పై సజ్జన్నార్ స్పందిస్తూ ఆ క్లిప్‌ను ట్వీట్‌తో పాటు పోస్టు చేశాడు.‘మండుటెండలో ఒక్క బైక్ మీద ఇంత మందా?. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరమైన ఇలాంటి బైక్ ప్రయాణం శ్రేయస్కరం కాదన్నారు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహారించడం బాధాకరం అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఆయన ట్వీట్‌పై పలువురు నెటిజన్లు సైతం స్పందించారు. బైకు మీద ఇద్దరి కంటే ఎక్కువగా వెళ్లకుండా కఠినమైన చట్టం తీసుకురావాలని ఒకరు చెప్పగా.. ఆర్టీసీ బస్సులో విద్యార్థుల పరిస్థితి కూడా అలాగే ఉందని, వాటిపై కూడా చర్యలు తసుకోవాలని సజ్జన్నార్‌ను కోరారు.