Telugu News » Ishan Kishan: అతడిని ఇంకెంత కాలం పక్కన పెడతారు… అజయ్ జడేజా ఆగ్రహం…!

Ishan Kishan: అతడిని ఇంకెంత కాలం పక్కన పెడతారు… అజయ్ జడేజా ఆగ్రహం…!

ఇషాన్ కిషన్(Ishan Kishan)ను పక్కన పెట్టడం పట్ల భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా(Ajay Jadeja) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇషాన్‌కు పదే పదే అన్యాయం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డాడు.

by Mano
Ishan Kishan: How long will he be sidelined... Ajay Jadeja's fury...!

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు మ్యాచ్‌లకు టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan)ను పక్కన పెట్టడం పట్ల భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా(Ajay Jadeja) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇషాన్‌కు పదే పదే అన్యాయం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డాడు.

Ishan Kishan: How long will he be sidelined... Ajay Jadeja's fury...!

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జడేజా బీసీసీఐ(BCCI)పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్‌లో ప్రతిభావంతుడైన ఆటగాడు ఉన్నాడని, తనదైన రోజున అతడు జట్టును భుజాన మోస్తాడని చెప్పారు. అలాంటి ఆటగాడికి తగినన్ని అవకాశాలను కల్పించి జట్టులో కుదురుకునేందుకు సమయం ఇవ్వాలని సూచించాడు.

‘‘ఎంతమంది ఇండియన్ క్రికెటర్లు వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు? అతడు మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చేయగలడు. అందుకు అతడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు? ఎన్ని రోజులు ఇలా అతన్ని ట్రయల్‌లో వాడుకుంటారు? గత రెండేళ్లలో ఇషాన్‌కిషన్ ఆడిన మ్యాచులు ఎన్ని? ఇండియన్ క్రికెట్‌లో ఈ సమస్య ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో వీళ్లు ప్లేయర్లను సెలక్ట్ చేయట్లేదు రిజక్ట్ చేస్తారంతే” అని జడేజా చెప్పుకొచ్చాడు.

అయితే, బీసీసీఐ తీరుపై జడేజా మండిపడ్డాడు. ప్లేయర్ల సెలక్షన్స్‌పై కాకుండా జట్టులో నుంచి ఎవరిని తప్పించాలన్న విషయంపైనే బీసీసీఐకి ధ్యాస ఎక్కువగా ఉంటుందని ఆరోపించాడు. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడారు. అయితే ఇషాన్ కిషన్ మాత్రం మూడు మ్యాచ్లు ఆడి ఇంటికెళ్లిపోయాడు. అతడు మూడు మ్యాచులకే అంతగా అలసిపోయాడా? వరల్డ్ కప్‌లోనూ అతన్ని సరిగా ఆడించలేదు. ప్రపంచ కప్‌లో జరిగిన మ్యాచుల్లోనూ అతడికి అవకాశం ఇవ్వాల్సిందని జడేజా అభిప్రాయపడ్డాడు.

ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడాడు ఇషాన్ కిషన్. అందులో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఒక మ్యాచ్‌లో మాత్రం డకౌట్‌గా వెనుదిరిగాడు. వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ (58) దాటాడు. ఇక ఆ తర్వాత తిరువనంతపురం వేదికగా జరిగిన పోరులో కేవలం 32 బంతుల్లోనే 52 రన్స్ స్కోర్ చేశాడు. మరోవైపు మూడు ఇన్నింగ్స్లోనూ 110 పరుగులు స్కోర్ చేశాడు.

You may also like

Leave a Comment