Telugu News » Israel: చాలా రోజులకు గాజాకు ఫుడ్ ట్రక్కులు.. ఇజ్రాయెల్‌పై ఆగని క్షిపణుల దాడి..!

Israel: చాలా రోజులకు గాజాకు ఫుడ్ ట్రక్కులు.. ఇజ్రాయెల్‌పై ఆగని క్షిపణుల దాడి..!

ఆహార పదార్థాలను తీసుకెళ్తున్న ట్రక్కులు ఉత్తర గాజా(North Gaza)కు చేరుకున్నాయని ఇజ్రాయెల్ అధికారులు బుధవారం తెలిపారు.

by Mano
Israel: Food trucks to Gaza for many days.. Non-stop missile attack on Israel..!

ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం(Israel-Hamas War)తో గాజాలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాలను తీసుకెళ్తున్న ట్రక్కులు ఉత్తర గాజా(North Gaza)కు చేరుకున్నాయని ఇజ్రాయెల్ అధికారులు బుధవారం తెలిపారు. యుద్ధంతో తీవ్రంగా ప్రభామితమైన గాజాకు ఆహార పదార్థాలు చేరుకోవడం గతకొన్ని వారాల్లో ఇదే తొలిసారి.

Israel: Food trucks to Gaza for many days.. Non-stop missile attack on Israel..!

మొత్తం 23 లక్షల మందిలో 5,76,000 మంది తీవ్ర క్షుద్బాధతో అలమటిస్తున్నారు. రెండేళ్లలోపు చిన్నారుల్లో ప్రతీ ఆరుగురిలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి సహాయక సంస్థ ప్రతినిధి రమేశ్‌ రామసింగం తెలిపారు. మిగిలిన వారూ సరైన ఆహారం దొరక్క అలమటిస్తున్నారని ఆయన వెల్లడించారు. జోర్డాన్‌, యూఏఈ, ఈజిప్టు, ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన విమానాల ద్వారా గాజాలో ఆహార పొట్లాలను జారవిడిచామని జోర్డాన్‌ వెల్లడించింది.

మరోవైపు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్లు క్షిపణి దాడులు చేశారు. 20 క్షిపణుల వరకు ప్రయోగించగా అందులో ఒకటి వైమానిక నిర్వహణ వ్యవస్థకు సమీపంలో పడినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది.  గాజా సిటీలోని కమల్‌ అద్వాన్‌ ఆస్పత్రిలో ఇద్దరు శిశువులు అతిసార, పోషకాహార లోపంతో మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది.

వేల మంది శిశువులు, గర్భిణులు మరణించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్‌ చెరలో ఉన్న బందీలను విడిపించాలని కోరుతూ ఇజ్రాయెల్‌లోని వారి బంధువులు, మద్దతుదారులు జెరూసలెం వరకు నాలుగు రోజుల ర్యాలీని ప్రారంభించారు. అటు యెమెన్ తీరం సమీపంలోని ఎర్ర సముద్రంలో సరకు రవాణా నౌకపై మంగళవారం రాత్రి హూతీ రెబల్స్ దాడి చేశారు.

You may also like

Leave a Comment