Telugu News » Mission Gaganyaan: గగన్‌యాన్‌ మొదటి టెస్ట్ ఫ్లైట్ కి ముహూర్తం ఖరారు..!

Mission Gaganyaan: గగన్‌యాన్‌ మొదటి టెస్ట్ ఫ్లైట్ కి ముహూర్తం ఖరారు..!

క్రూ మాడ్యూల్ బంగాళాఖాతంలో ల్యాండ్ చేయనున్నారు. కాగా పారాచూట్ల సాయంతో టీవీ-డీ1 శ్రీహ‌రికోట నుంచి 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌ముద్ర జలాల్లో ల్యాండ్‌ కానుంది. మరోవైపు టీవీ-డి1 టెస్ట్ ఫ్లైట్ తర్వాత మరో మూడు టెస్ట్ వెహికల్ మిషన్లు నిర్వహిస్తామని, గతంలో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.

by Venu

ఒకప్పుడు ప్రపంచ దేశాలకు భారత అంతరిక్ష పరిశోధన (Indian Space Research) సంస్థ అంటే ఒక భావం ఉండేది. దీనికి తగ్గట్టుగానే పరిశోధనల్లో భారత్ (Bharath) కాస్త వెనకే ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో పలు పరిశోధనలకు కేంద్ర బిందువుగా మారి, ప్రపంచంలో భారత కీర్తి సుస్థిరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగించాక ప్రపంచ దేశాల దృష్టిని తన వైపు తిప్పుకొన్న ఇస్రో మరో కొత్త ప్రయోగం మొదలు పెట్టింది.

మానవసహిత అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుట్టింది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే ఈ ప్రాజెక్టులో కీల‌క‌మైన టెస్ట్ వెహిక‌ల్ అబోర్ట్ మిష‌న్-1 టెస్ట్ ఫ్లైట్ అక్టోబర్ 21న ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య నిర్వహించనున్నట్టు సోమవారం ప్రకటించింది. మరోవైపు టెస్ట్ మాడ్యూల్‌కు చెందిన ఫోటోల‌ను ఇస్రో త‌న ట్విట్ట‌ర్‌ ఖాతాలో పోస్టు చేసింది.

నేషనల్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం.. టీవీ-డీ1 (TV-D1) టెస్ట్ ఫ్లైట్ శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఇక అంత‌రిక్షంలోకి వ్యోమ‌గాముల్ని పంపేందుకు ఇస్రో ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీని కోసం గ‌గ‌న్‌యాన్ (Gaganyaan) ప్రాజెక్టును చేప‌ట్టింది. ఈ ప్రాజెక్టులో కీల‌క‌మైన క్రూ మాడ్యూల్ ( Crew Module)ప‌రీక్ష‌కు ఇస్రో సిద్ద‌మైంది.

ఈ టెస్టింగ్‌లో భాగంగా మాడ్యూల్‌ను నింగిలోకి పంపి, మ‌ళ్లీ సురక్షితంగా భూమిపైకి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా క్రూ మాడ్యూల్ బంగాళాఖాతంలో ల్యాండ్ చేయనున్నారు. కాగా పారాచూట్ల సాయంతో టీవీ-డీ1 శ్రీహ‌రికోట నుంచి 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌ముద్ర జలాల్లో ల్యాండ్‌ కానుంది. మరోవైపు టీవీ-డి1 టెస్ట్ ఫ్లైట్ తర్వాత మరో మూడు టెస్ట్ వెహికల్ మిషన్లు నిర్వహిస్తామని, గతంలో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.

You may also like

Leave a Comment