Telugu News » Congress : దశాబ్దాల తరబడి హస్తం మాట వినిపించని చోట విక్టరీ సాధించిన కాంగ్రెస్..!!

Congress : దశాబ్దాల తరబడి హస్తం మాట వినిపించని చోట విక్టరీ సాధించిన కాంగ్రెస్..!!

రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అయితే గత 56 సంవత్సరాలుగా అధికారం దక్కని నర్సంపేట నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ విజయం సాధించింది. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు.

by Venu
telangana congress cm swearing ceremony telangana assembly election results 2023

తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరేసిన విషయం తెలిసిందే.. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలలో విక్టరీ సాధించిన హస్తం కు ఈ ఎన్నికలు స్పెషల్ గా మారాయి అంటున్నారు. ఎందుకంటే దశాబ్దాల తరబడి చేయి గుర్తు మాట వినిపించని నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ పాగా వేసింది. ఇంతకు ఆ నియోజకవర్గాలేంటో తెలుసుకుందామా..

Assembly Results: Congress is strong in Telangana.. big victory in two places..!

రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అయితే గత 56 సంవత్సరాలుగా అధికారం దక్కని నర్సంపేట నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ విజయం సాధించింది. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. చివరగా 1967లో కాంగ్రెస్‌ అభ్యర్థి కె.సుదర్శన్‌రెడ్డి.. సీపీఎం అభ్యర్థి ఎ.వెంకటేశ్వరరావుపై గెలిచారు. అప్పటి నుంచి ఈ నియోజక వర్గంలో గెలుపు అనే మాట హస్తానికి దూరం అయ్యింది.

మరోవైపు 2009లో ఏర్పాటైన పాలకుర్తిలో కాంగ్రెస్‌ (Congress)కు ఇదే తొలి విజయం. ఈ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు పాత చెన్నూరు పరిధిలో(రద్దయిన) ఉండగా 1983లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 2009 నుంచి గెలుస్తూ వస్తున్న ఎర్రబెల్లి దయాకరరావుపై ఇప్పుడు యశస్వినిరెడ్డి (Yashaswini Reddy) గెలవడం స్థానిక కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపింది.

భువనగిరి కోటపై కూడా కాంగ్రెస్ నలభై ఏళ్ల తర్వాత జెండా ఎగిరేసింది. హ్యాట్రిక్‌ ప్రయత్నంలో ఉన్న భారాస అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) విజయం సాధించారు. ఇక్కడ చివరగా 1983లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కె.నర్సింహారెడ్డి విజయం సాధించారు.

నాగర్‌కర్నూల్‌లో 34 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ను విజయం పలకరించింది. హ్యాట్రిక్‌కు ప్రయత్నిస్తున్న భారాస అభ్యర్థి మర్రి జనార్ధన్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి గెలుపొందారు. చివరగా ఇక్కడ 1989లో కాంగ్రెస్‌ తరఫున వంగా మోహన్‌గౌడ్‌ విజయం సాధించారు.

రామగుండం నియోజకవర్గంలో కూడా 34 సంవత్సరాల అనంతరం హస్తానికి విజయం చేయి అందించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై విజయం సాధించారు. మరోవైపు 1989లో కాంగ్రెస్‌ నుంచి మాతంగి నర్సయ్య గెలిచారు. అప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ ను విజయం పలకరించలేదు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధి ఖానాపూర్‌(ఎస్టీ) ఎట్టకేలకు హస్త గతమైంది. ఆ పార్టీ అభ్యర్థి వెడ్మ బొజ్జు తన సమీప భారాస అభ్యర్థి, మంత్రి కేటీఆర్‌ స్నేహితుడైన జాన్సన్‌ నాయక్‌పై 4,976 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి చరిత్రను తిరగరాశారు.

మెట్‌పల్లి నియోజకవర్గంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ విజయం సాధించింది. అంటే ఇప్పటికీ 25 సంవత్సరాలు అవుతుంది. 1998 ఉప ఎన్నికలో కొమ్మిరెడ్డి జ్యోతి విజయం సాధించారు. 2009లో వేములవాడ నియోజకవర్గం ఏర్పాటైంది. కాగా ప్రస్తుతం కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ గెలుపొందారు.

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో 25 ఏళ్ల అనంతరం కాంగ్రెస్‌ పాగా వేసింది. కాంగ్రెస్‌ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి.. భారాస ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌పై విజయం సాధించారు. చివరిసారి 1998 ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి పీవీ రంగారావు ఇక్కడ విజయం సాధించారు.

కాంగ్రెస్‌ చొప్పదండి నియోజకవర్గాన్ని 24 ఏళ్ల అనంతరం కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యం సిట్టింగ్‌ ఎమ్మెల్యే, భారాస అభ్యర్థి సుంకె రవిశంకర్‌పై విజయం సాధించారు. చివరిగా 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి కె.సత్యనారాయణ గౌడ్‌ విజయం సాధించారు.

ధర్మపురిలో భారాస అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పై, ఎ.లక్ష్మణ్ కుమార్‌ విజయం సాధించారు. నాలుగు ఎన్నికల అనంతరం లక్ష్మణ్‌కు విజయం దక్కింది. ధర్మపురి.. ఇందుర్తిగా ఉన్నప్పుడు 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి బొమ్మా వెంకటేశ్వర్‌ విజయం సాధించారు. మరోవైపు 2009లో ధర్మపురి కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది.

You may also like

Leave a Comment