సీతా రాములు అత్యంత ఆదర్శవంతమైన దంపతులని బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్ (Javed Akthar) అన్నారు. ప్రేమకు, వివాహ బంధానికి ఆ పుణ్య దంపతులే ఆదర్శమని తెలిపారు. హిందు మతం మనకు ప్రజాస్వామ్య విలువలను నేర్పిందని పేర్కొన్నారు. అందుకే ఇప్పటికీ భారత్‌లో ప్రజాస్వామ్యం (Democracy) బతికి ఉందని వెల్లడించారు.
ముంబైలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా చీఫ్ రాజ్ థాకరే నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమంలో జావెద్ అక్తర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనకు ఎంతో మంది దేవుళ్లు ఉన్నారని చెప్పారు. కానీ ఆదర్శవంతమైన దంపతులు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సీతారాములు అని తెలిపారు.
కొంత మంది ఎప్పుడూ అసహనంగా ఉంటారన్నారు. కానీ హిందువులు మాత్రం అలా కాదన్నారు. వాళ్లకు సహనం ఎక్కువగా ఉంటుందన్నారు. హిందువుల్లో కరుణ ఎక్కువగా ఉంటుందని, వారికి విశాలమైన హృదయం ఉంటుందన్నారు. అది హిందువులు సంస్కృతి అన్నారు. అది మన నాగరికత గొప్పతమన్నారు.
అందుకే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందన్నారు. కేవలం మనం మాత్రమే కరెక్ట్…మిగతా వారంతా తప్పు అనే భావన హిందువుల్లో ఉండదన్నారు. సీతారాములు కేవలం దేవుళ్లు మాత్రమే కాదన్నారు. వారు భారతీయ సంస్కృతికి, వారసత్వానికి ప్రతీకలు అని వివరించారు.