ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం తిహార్(Tihar Jail) జైలులో జ్యుడీషియల్ కస్టడీ మీద ఉన్న కవిత(MLC KAVITHA)ను ఈడీ(ED) అధికారులు మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట వర్చువల్‌గా హాజరుపరచనున్నారు.నేటితో ఆమెకు విధించిన జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కానుంది. అయితే, ఆమెకు ఈసారైనా బెయిల్ వస్తుందా?లేక జ్యుడీషియల్ రిమాండ్‌ను మరోసారి పొడగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
లిక్కర్ కుంభకోణం కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు సార్లు కవితను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అనంతరం ఆమెకు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి భవేజా రెండు సార్లు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
దీంతో ఆమె నెల రోజులకు పైగా నుంచి తిహార్ జైలులోనే ఉంటున్నారు. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. ఏప్రిల్ 11న తేదీన ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలులోనే సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆమెను సీబీఐ కస్టడీకి ఇచ్చింది.
కాగా, కవిత ఈడీ, సీబీఐ తనను అరెస్టు చేయడంపై దాఖలైన రెండు బెయిల్ పిటిషన్లపై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి.సీబీఐ అరెస్టుకు సంబంధించి ఇప్పటికే వాదనలు పూర్తవ్వగా మే 2న తుది తీర్పు వెలువరించనున్నట్లు న్యాయమూర్తి కావేరి భవేజా పేర్కొన్నారు. కాగా, నేడు ఈడీ తరఫు న్యాయవాదులు ఆమెకు మరోసారి రిమాండ్ విధించాలని కోర్టును కోరనున్నట్లు సమాచారం. దీనిపై మరి కోర్టు పాజిటివ్‌గా స్పందిస్తుందా? లేక కవితకు బెయిల్ మంజూరు చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది.