కన్నడ సీరియల్ నటి అయిన జ్యోతీరాయ్ (Jyothi Roy) తెలుగులో కూడా భారీ పాపులారిటీనే (Popularity)సంపాదించుకుంది. ఆల్రెడీ పెళ్లయిపోయిన జ్యోతి గత కొన్ని రోజులు నుంచీ ఒక కుర్ర దర్శకుడితో రిలేషన్ (Relation)లో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడా రూమర్లపై తానే స్వయంగానే క్లారిటీ ఇచ్చింది.
గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జ్యోతిరాయ్ బందే బరాటవ కాలా” అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. దాదాపు 20 కి పైగా సీరియల్స్ లో నటించిన ఈమె, కన్నడ, తమిళం, తెలుగు, తుళు భాషల్లోని కొన్ని సినిమాల్లో కూడా కనిపించింది. కెరీర్ ప్రారంభంలోనే పెళ్లి చేసుకున్న జ్యోతి ఒక బాబుకు జన్మనిచ్చింది.
గత కొద్ది రోజులుగా భర్తకు దూరంగా ఉంటున్న జ్యోతిరాయ్ తాజాగా సుకు పుర్వాజ్ అనే యంగ్ డైరెక్టర్తో రిలేషన్ లో ఉందని టాక్. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ వీరిద్దరూ రిలేషన్ని కన్ఫార్మ్ చేసేశారు. తాజాగా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుకు పుర్వాజ్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ క్యాప్షన్ లో ఉంగరం గుర్తుతో పాటు లవ్ బర్డ్స్ ఏమోజీ కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో రూమర్స్ నిజమే నంటూ క్లారిటీ ఇచ్చినట్టయ్యింది.