Telugu News » K.Laxman: ప్రజల మనోగతానికి అనుగుణంగా పాలన: ఎంపీ కె.లక్ష్మణ్

K.Laxman: ప్రజల మనోగతానికి అనుగుణంగా పాలన: ఎంపీ కె.లక్ష్మణ్

ముషీరాబాద్(Musheerabad) అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎస్ఎఫ్ నిధులతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

by Mano
K.Laxman: Governance according to people's sentiments: MP K.Laxman

కేంద్ర ప్రభుత్వం ప్రజల మనోగతానికి అనుగుణంగా పాలన కొనసాగిస్తోందని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్(K.Laxman) అన్నారు. ముషీరాబాద్(Musheerabad) అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎస్ఎఫ్ నిధులతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ నగర్ డివిజన్‌లోని అశోక్ నగర్ రోడ్ నంబర్ 4లో కాలనీ వాసుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు.

K.Laxman: Governance according to people's sentiments: MP K.Laxman

అదేవిధంగా అశోక్ నగర్ కమ్యూనిటీ హాల్ లో, అడిక్మెట్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో నూతన ఫర్నీచర్, ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల మన్ననలు చూరగోనాలనే సిద్ధాంతంతో భవిష్యత్తులో మరిన్ని సేవలు కొనసాగిస్తామన్నారు. ప్రధాని మోడీ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ సంస్థల సౌజన్యంతో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగానే దాదాపు 3.5 కోట్లతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

పలు కాలనీల్లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన ఫర్నీచర్, ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేశామన్నారు. ఓఎన్‌జీసీ  సంస్థ సౌజన్యంతో ముషీరాబాద్, ఘట్కేసర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. తాను పుట్టిన ఘట్కేసర్ తో పాటు అశోక్ నగర్ అభివృద్ధిలో తన వంతు కర్తవ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల సౌజన్యంతో ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.

గతంలో రెండు సార్లు ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పని చేశానని అన్నారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నపటికీ పుట్టిన ప్రాంతం, పెరిగిన ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఈ అభివృద్ధిలో పాలుపంచుకున్నానని అన్నారు. ప్రధాని మోడీ అసాధ్యం అనుకున్న వాటిని కూడా సాధ్యం చేసిన చూపించారని తెలిపారు.

ముఖ్యంగా రామమందిర నిర్మాణం, 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్ లాంటి చట్టాలు రద్దు చేశారని, మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించారని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉందని, గత వారంలో కొన్ని పాఠశాలల్లో పర్యటించినప్పుడు తన దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు.

You may also like

Leave a Comment