కామారెడ్డి జిల్లా (Kama Reddy District) తాడ్వాయి మండలంలోని భీమేశ్వర వాగు దాటుతూ మేతకు వెళ్లి తిరిగి వస్తున్న సుమారు రెండువందల పశువులు నీటిలో కొట్టుకుపోయాయి. ఎగువున కురుస్తున్నభారీ వర్షాల (Heavy Rains)కు భీమేశ్వరవాగు ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంమే దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు. పదుల సంఖ్యలో పశువులు వాగులో కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది.
గురువారం తాడ్వాయి మండలంలోని సంతాయిపేటకు చెందిన 200 పశువులను ఇద్దరు వ్యక్తులు గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మేతకు తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇళ్లకు తీసుకెళ్లడానికి భీమేశ్వరవాగు దాటిస్తుండగా ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో వాగుదాటుతున్న అన్ని పశువులూ నీటిప్రవాహంలో కొట్టుకుపోయాయి.
దీంతో గ్రామస్థులంతా వాగు వద్దకు చేరి పశువులను రక్షించడాని సహాయక చర్యలు చేపట్టారు. కొంత దూరంలో రాళ్లలో ఇరుక్కున్న 20 మూగజీవాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. మీగతా వాటి కోసం గాలించగా.. రాత్రి పది గం టల సమయంలో మరో 80 పశువులను ఒడ్డుకు చేర్చగలిగారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న తాడ్వాయి పోలీసులు, కామారెడ్డి అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.