Telugu News » Kapil Dev : కపిల్ దేవ్ ను కిడ్నాప్ చేశారా… వీడియో షేర్ చేసిన గంభీర్….!

Kapil Dev : కపిల్ దేవ్ ను కిడ్నాప్ చేశారా… వీడియో షేర్ చేసిన గంభీర్….!

. దీనికి సంబంధించిన వీడియోను భారత మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ (Ghambir) పోస్టు చేశారు.

by Ramu
Kapil Dev kidnapped See how Netizens react to a viral video

క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌ (Kapil Dev) కిడ్నాప్ నకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. ఇద్దరు  వ్యక్తులు కపిల్ నోటికి కర్చీఫ్, చేతులకు తాళ్లు కట్టి బలవంతంగా ఓ గదిలోకి తీసుకు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను భారత మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ (Ghambir) పోస్టు చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kapil Dev kidnapped See how Netizens react to a viral video

ఇంతకు ఏం జరిగిందంటే…. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, హర్యానా హరికేన్‌ను కిడ్నాప్ చేశారా? అంటూ గౌతం గంభీర్ ఓ వీడియో షేర్ చేశారు. అందులో కపిల్ దేవ్ ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ వీడియో తనకు వచ్చిందని వచ్చిందని, మీకు కూడా ఇలాంటి వీడియో వచ్చిందా అని గంభీర్ తన అభిమానులను ప్రశ్నించారు.

వీడియోలోని వున్న వ్యక్తి కపిల్ దేవ్ కాకూడదని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆయనకు ఏమీ కాకూడదని, దేవుని దయ వల్ల ఆయన క్షేమంగా వుండాలని కోరుకుంటున్నట్టు ఆయన కామెంట్ చేశారు. దీంతో కపిల్ కు ఏమైందని నెటిజన్లు, ఆయన అభిమానులు అంతా కంగారు పడ్డారు.

కానీ కాసేపటి తర్వాత అసలు విషయం బయట పడింది. ఆ వీడియో కపిల్ దేవ్ నటించిన ఓ యాడ్ కు సంబంధించిన క్లిప్ అని తెలిసింది. దీంతో విషయం తెలుసుకుని జనాలు పడి పడి నవ్వుకున్నారు. మొదట్లో అభిమానులు కాస్త కంగారు పడ్డా ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఎంజాయ్ చేశారు.

You may also like

Leave a Comment