త్వరలో పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బీఆర్ఎస్ (BRS) తీవ్రప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) సైతం సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.. ఈ క్రమంలో ఒకరిమీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం కనిపిస్తుంది. కాగా తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్.. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు..
నేడు గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రం పదేళ్ల నుంచి తెలంగాణను మోసం చేసిందని మండిపడ్డారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు.. బీజేపీ సైతం చేసింది ఏం లేదని ఆరోపించారు.. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ వైఫల్యాలపై ఏప్రిల్ 14న దీక్ష చేపడతానని పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రకటించారు..
కరీంనగర్ (Karimnagar) కాంగ్రెస్ కార్యాలయంలో దీక్షకు దిగనున్నట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎవరెవరికి ఇచ్చారో వారినే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని పేర్కొన్న ఆయన.. తమవైపు ఒక్క వేలు చూపెడితే, తాము నాలుగు వేళ్లు చూపెడతామని హెచ్చరించారు.. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మాదిరిగా మాట మార్చే ప్రభుత్వం తమది కాదని.. వారిది ఓట్ల రాజకీయం అని విమర్శించారు..