కర్ణాటక బీజేపీ (BJP) ఎమ్మెల్యే బసన గౌడ (Basana Gowda) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) కాదని ఆయన అన్నారు. దేశానికి తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subash Chandra Bose) అని ఆయన చెప్పారు. బ్రిటీష్ వారిని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గడగడ లాడించారని చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బెంగళూరులో ఓ పబ్లిక్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ…. దేశానికి స్వాతంత్ర్య కేవలం నిరసనలు, నిరాహార దీక్షల వల రాలేదని బాబా సాహెబ్ అంబేడ్కర్ ఓ పుస్తకరంలో రాశారని తెలిపారు. ఒక చెంప పగులగొడితే మరో చెంప చూపించాలన్న గాంధీ మహత్ముని సిద్దాంతాల వల్ల కూడా రాలేదన్నారు.
కేవలం బ్రిటిష్ వాళ్లకు సుభాష్ చంద్రబోస్ అంటే భయం కలగడంతోనే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. రెండో ప్రపంచ యుద్దం తర్వాత బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోగా దేశంలోని కొన్ని భాగాలకు స్వాతంత్ర్య ప్రకటించగా స్వాతంత్ర్య భారత్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలి ప్రధాని అయ్యారని చెప్పారు. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక కరెన్సీ, జాతీయ పతాకం, జాతీయ గీతం కూడా ఉందన్నారు.
అందుకే అందరూ భావిస్తున్నట్టు జవహర్ లాల్ నెహ్రూ తొలి ప్రధాని కాదన్నారు. బసనగౌడ్ పాటిల్ తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే మరో ఐదు నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కూలి పోతుందని ఆయన అన్నారు. పార్టీలో అంతర్గత కలహాల వల్లే ప్రభుత్వం కూలి పోతుందని వ్యాఖ్యలు చేశారు.