తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైంది. హైదరాబాద్, మెదక్ జిల్లాలో మా పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపుతారని కరీంనగర్లో మంచి సీట్లు వచ్చాయన్న కేటీఆర్ ఎందుకు ఓడిపోయేమో అర్థం కావట్లేదని చెప్పారు. ఓటమిని అంగీకరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీకి అభినందనలు చెప్పారు కేటీఆర్ ఓటమికి గల కారణాలని విశ్లేషిస్తామని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. అయితే ఓటమికి కారణాలు ఎన్ని అయినా ఉండొచ్చు కానీ కెసిఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో చూసిన ఒకే ఒక్క తప్పిదం గులాబీ పార్టీని దెబ్బ తీసింది అని చెప్పొచ్చు.
అన్ని పార్టీలకంటే ముందుగానే అభ్యర్థులని ప్రకటించి ముందుగానే ఎన్నికలకి సిద్ధమైన కేసీఆర్ సిట్టింగ్ లకే ఎక్కువ సీట్ల ని కేటాయించారు. సిట్టింగ్ల పట్ల వ్యతిరేకత ఉందని తెలిసినా కూడా మార్చడానికి ఇష్టపడలేదు. ఇదివరకు ఎలా అయితే ఓట్లు వేసారో ఇప్పుడు కూడా అలానే ఓట్లు వేసి గెలిపిస్తారని భావించారు కానీ ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకత కి కెసిఆర్ ఇమేజ్ కూడా అసలు పని చేయలేదు. కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించగానే తమకి అభ్యర్థి వద్దని చాలా నియోజకవర్గాల్లో కింద స్థాయి నాయకులు ఆందోళన చేశారు.
Also read:
అయినా కూడా వెనక్కి తగ్గలేదు. కేసీఆర్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను తప్పించి వాళ్ళకి బదులుగా కొత్త వాళ్లకే అవకాశం ఇచ్చి ఉన్నట్లయితే టిఆర్ఎస్ ఇతర పార్టీలతో కలిసి కనీసం హంగ్ ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేసి ఉండేదని అంటున్నారు కెసిఆర్ అభ్యర్థులని మార్చిన స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడమే దీనికి నిదర్శనము కెసిఆర్ మొత్తం పని స్థానాల్లో అభ్యర్థులని మార్చారు అక్కడ టిఆర్ఎస్ గెలిచింది.