పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy Cm batti vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం కూసుమంచి మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఇందులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister ponguleti Srinivas reddy), ఎంపీ అభ్యర్థి రఘురామి రెడ్డి (Mp Raghurami reddy) రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమల్లోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, రూ.500 కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేశామన్నారు.
రైతులపై కేసీఆర్ దొంగ ప్రేమ చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు.కాంగ్రెస్ పార్టీకి రైతులపై ప్రేమ ఉందని, తాము వచ్చిన అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వారికి ఇన్యూరెన్స్ కట్టించామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ విద్యార్థుల మెస్ బిల్లులు చెల్లించకపోతే కాంగ్రెస్ పార్టీ కట్టిందన్నారు.
ఉద్యోగులకు మొదటి తారిఖునే జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో కరెంట్ కోతలు, నీటి సమస్యలు ఉన్నాయని బద్నాం చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం పేదలకు ఇందరిమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఎస్టీ, ఎస్టీలకు ఇంటి నిర్మాణానికి రూ.6లక్షలు ఇస్తామని భట్టి స్పష్టంచేశారు. కేసీఆర్ నోటి కొచ్చినట్లు అబద్ధాలు చెబుతూ మాయ చేస్తున్నారని, ఆయన మాటలను ప్రజలెవ్వరూ నమ్మొద్దని డిప్యూటీ సీఎం భట్టి పిలుపునిచ్చారు.