గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ సీఎం కేసీఆర్ (KCR) ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీపై విరుచుకపడ్డారు. కేంద్రంలోని మోడీ (MODI) ప్రభుత్వాన్ని ఎండగట్టారు. రాష్ట్రానికి మోడీ చేసింది ఏమీ లేదని తూర్పారబట్టారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ(Rahul gandi), రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని(Revanth ReddY) ఏకిపారేశారు. వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని నమ్మకంగా చెప్పారు. కానీ, కేసీఆర్ అంచనాలు తప్పాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం చకచకా జరిపోయాయి. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మాజీ సీఎం కేసీఆర్‌కు కొత్త చిక్కులు మొదలయ్యాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ సర్కార్ బయటపెట`డం ప్రారంభించింది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, హైదరాబాద్, యాదగిరిగుట్ట, రంగారెడ్డిలో ఆ పార్టీ ఎమ్మెల్యేల భూకజ్జాలు, వారి అవినీతిని ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు.
సరిగ్గా అదే టైంలో కవితను ఈడీ అరెస్టు చేయడం, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ,మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అవ్వడం ఇవన్నీ పరిణామాలు కేసీఆర్‌కు ఊపిరాడకుండా చేసేశాయి . కాంగ్రెస్ వంద రోజుల పాలన పూర్తవ్వడం, ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు.
నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. బీజేపీ(BJP) జోలికి పోవడం లేదు. ఒక్కసారిగా ఎందుకు ఇలా మారిపోయారు.కవిత అరెస్టు నేపథ్యంలో ఆయనలో మార్పు వచ్చిందా? బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా? అని కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
అదే జరిగితే కవిత బయటకు వచ్చేంతవరకు బీజేపీపై కేసీఆర్ మౌనం వహిస్తారని తెలుస్తోంది. కానీ , బీజేపీ మాత్రం ఈలోపు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కించుకోవాలని ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఇకలేదు అని ప్రజెంట్ చేయాలని కాషాయ శ్రేణులు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.