తెలంగాణ (Telangana) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా రవాణాశాఖ (Transport Department )లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఓడీ(OVER DUTY)లను రద్దు చేసింది. MVI, AMVI, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఓడిలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వీటికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది.
మరోవైపు తెలంగాణా రవాణా శాఖలో ఉన్న ముగ్గురు JTC లను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్టు ప్రభత్వం పేర్కొంది. JTC ల ట్రాన్స్‌ఫర్ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. హైదరాబాద్ JTC గా ఉన్న పాండురంగ నాయక్ ను JTC అడ్మిన్ గా ట్రాన్స్‌ఫర్ చేసింది. హైదరాబాద్ JTC అడ్మిన్ గా ఉన్న మమతా ప్రసాద్ ను (IT & VIG) కు బదిలీ చేసింది. హైదరాబాద్ JTC ( IT & VIG) గా ఉన్న రమేష్ ను హైదరాబాద్ JTC గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే రాష్ట్ర పాలనలో తనదైన మార్క్ ఉండేలా చూసుకొంటున్న రేవంత్ సర్కార్.. అధికారంలోకి రాగానే.. పలు శాఖలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. ఉన్నతాధికారుల నుంచి మొదలు.. అన్ని శాఖలలో అధికారుల మార్పులు.. కొత్త వారి చేర్పులు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారికి సైతం స్థాన చలనం తప్పలేదు.. అవినీతి మరక అంటిన ఉద్యోగుల విషయంలో సైతం కీలక నిర్ణయాలతో రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తుంది..
మొత్తానికి అన్ని శాఖల ప్రక్షాళన కోసం కంకణం కట్టుకొన్న రేవంత్ సర్కారు.. ఇప్పటికే బీఆర్ఎస్ చేసిన అవినీతి విషయంలో సైతం వెనకడుగు వేయడం లేదని అంటున్నారు.. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా.. లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుబడుతోన్నట్టు మంత్రులు కూడా పలు సందర్భాలలో వెల్లడించడం కనిపిస్తుంది..