టీమిండియా వెస్టిండీస్ పై అద్భుత విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.రెండో వన్డేలో ఘోర పరాజయాన్ని పొందిన ఇండియా మూడో వన్డేలో భారత్ 200 పరుగుల తేడాతో కరేబియన్లకు విశ్వరూపం చూపించింది.
తొలుత టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్ కేవలం 151 రన్స్‌కే ఆలౌటైంది. ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు సత్తాచాటారు. నిర్ణీత ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 315 రన్స్ చేసింది.
శార్దూల్ ఠాకూర్ 4, ముకేశ్ కుమార్ 3 వికెట్లు తీసుకున్నారు. అయితే కరీబియన్ టూర్లో మొదట నిరాశపరిచిన శుభమన్ గిల్..మూడవ వన్డేలో అద్భుతంగా రాణించాడు. 92 బంతుల్లో 85 పరుగులు అందించాడు
మరో ఓపెనర్ ఇషాన్ కిషణ్తో కలిసి ఇద్దరూ తొలి వికెట్‌కు 143 రన్స్ జోడించారు. కిషణ్ కూడా జోరుగా బ్యాటింగ్ చేశాడు. అతను 64 బంతుల్లో 77 రన్స్ చేశాడు. ఓపెనర్లు ఇచ్చిన ఊపును మిడిల్ ఆర్డర్ కూడా కొనసాగించింది.
సంజూ సాంసన్ 41 బంతుల్లో 51 రన్స్ చేశాడు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా భారీ షాట్లతో అలరించాడు. పాండ్యా కేవలం 50 బంతుల్లో 70 రన్స్ చేశాడు. దాంట్లో అయిదు సిక్సర్లు, నాలుగు బౌండరీలు ఉన్నాయి.
ఇక భారీ టార్గెట్‌తో చేజింగ్ ప్రారంభించిన విండీస్‌కు ఆరంభంలో ముకేశ్ కుమార్ తన పేస్‌తో ఇబ్బందిపెట్టాడు. పవర్‌ప్లేలో విండీస్ దూకుడును అతను అడ్డుకున్నాడు. ముకేశ్ ఏడు ఓవర్లలో 30 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.
శార్దూల్ 4, జయదేవ్ 1, కుల్దీప్ 2 వికెట్లు తీసుకున్నారు. విండీస్ బ్యాటర్లలో మోతే(39 నాటౌట్),అల్జరీ జోసఫ్(26)లు తొమ్మిదో వికెట్‌కు 55 రన్స్ జోడించడం విశేషం.