ఖలిస్తానీ ఉగ్రవాది (Khalistani Terrorist) లఖ్ బీర్ సింగ్ రోడే (Lakhbir Singh Rode) మరణించాడు. ఖలిస్థాన్ వేర్పాటు వాద నేత జర్నెయిల్ సింగ్ బింద్రావాలా మేనల్లుడు లఖ్ బీర్ సింగ్ పాక్ లో కన్ను మూశాడు. ఈ నెల 2న ఆయన గుండె పోటుతో చని పోయారని నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది. సిక్కు సాంప్రదాయాల ప్రకారం ఆయన అంత్యక్రియలను అత్యంత రహస్యంగా నిర్వహించినట్టు సమాచారం.
లఖ్ బీర్ సింగ్ పంజాబ్‌లో ఉగ్ర కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ సంస్థ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ బీర్ షింగ్ ఉగ్ర కార్యకలపాలు నిర్వహించే వాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆయన నివాసంపై యాంటీ టెర్రర్ ఏజెన్సీ దాడులు చేసింది. ఈ క్రమంలో బీర్ సింగ్ ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)జప్తు చేసింది.
2021 నుంచి 2023 మధ్య పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో ఆయన పాల్గొన్నాడు. కన్షిక బాంబు పేలుళ్ల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. జలాలా బాద్ లో టిఫిన్ బాక్స్ బాంబు పేలుళ్ల ఘటనలో ఆయన ప్రమేయం ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ కు ఆయుధాలు పంపడం, పలు ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడిన ఘటనల్లో ఆయనపై విచారణ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఆయనపై ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో యాంటీ టెర్రర్ ఏజెన్సీ దర్యాప్తు మొదలు పెట్టింది. నిషేధిత ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ISYF)కు చీఫ్ గా కొనసాగారు. దీంతో పాటు ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ (KLF)సంస్థకు కూడా చీప్ గా పని చేశారు. బీర్ సింగ్ మరణ వార్తను ఆయన సోదరుడు అకల్ తఖ్త్ జతేదార్ జస్బీర్ సింగ్ ధ్రువీకరించారు. పాకిస్తాన్ లో లఖ్ వీర్ సింగ్ మరణించినట్టు కెనడాలోని ఆయన కుమారుడు తెలిపాడన్నారు. ఈ నెల 2న ఉదయం వీర్ సింగ్ మరణించాడన్నారు.