తెలంగాణ (Telangana) పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రముఖ హీరో సిద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. కాంగ్రెస్ (Congress) పార్టీ తరపున ఖమ్మం లోక్సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపుకోసం రంగంలోకి ప్రముఖ టాలీవుడ్ నటుడు వెంకటేష్ దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మే 7న ఖమ్మం (Khammam)లో ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం.

మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సైతం రఘురాం రెడ్డి వియ్యంకుడు అవుతారు. ఆయన కూడా గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. మరి వీరి ప్రచారం రఘురాం రెడ్డికి ఎంత వరకు కలిసి వస్తుందో అనే ఆసక్తి నెలకొంది. అలాగే ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో తీవ్ర పోటీ ఉండగా.. దాదాపు 20 రోజుల పాటు తీవ్ర తర్జనభర్జనల మధ్య అధిష్టానం ఎంపీ టికెట్ రఘురాంరెడ్డికి కేటాయించింది.