ఉన్నత విద్య కోసం అమెరికా (America)వెళ్లిన 24 ఏళ్ల భారతీయ యువకుడిపై దాడి జరిగింది. ఖమ్మం (Khammam) జిల్లాకు చెందిన వరుణ్ (Varun) చికాగో (Chicago)లో ఉంటూ ఇండియానాలో ఎంఎస్ చదువుతున్నాడు. ఇండియానా(Indiana)లోని వల్పరైసో సిటీ (Valparaiso City)లో ఉన్న ఓ జిమ్ వద్ద జోర్డాన్ ఆండ్రాడ్ అనే నిందితుడు వరుణ్ పై కత్తితో అటాక్ చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వరుణ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు అక్కడి వైద్యులు చెబుతున్నారు. కాగా ఫోర్ట్ వెయిన్ హాస్పిటల్‌లో వరుణ్‌కి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
మరోవైపు దాడికి గల కారణాల గురించి అధికారులు విచారిస్తున్నారు. అటాక్ తర్వాత దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి హత్యాయత్నం కింద కేసు బుక్ చేశారు. కాగా వరుణ్ కండీషన్ సిరీయస్‌గా ఉందని, అతను బ్రతికే ఛాన్సు కేవలం 5 శాతమే ఉన్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. దీంతో వీరి కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు కమ్ముకున్నాయి..
ఇక ఖమ్మంలోని బుర్హాన్‌పురంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్.. ఉన్నత చదువు నిమిత్తం విదేశానికి వెళ్ళిన కొడుకు రక్తపు మడుగులో ఉండడాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈమేరకు అమెరికా వెళ్లేందుకు సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్‌ను కోరినట్లు రామ్మూర్తి తెలిపారు.