ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ Kim Jong Un)కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) అదిరిపోయే ఓ గిఫ్ట్‌ను ఇచ్చారు. వ్యక్తిగత అవసరాలకు వాడుకునేందుకు ఆయనకు ఓ కారును బహూకరించారు. ఈ విషయాన్ని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఫిబ్రవరి 18న కిమ్ తరఫున ఆయన సోదరి కిమ్ యో జోంగ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ప్రతినిధి పాక్ జోంగ్ ఛోన్ దాన్ని అందుకున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కిమ్ యో జోంగ్ రష్యాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరువురు నేతల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.
రష్యా, ఉత్తరకొరియాపై అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ పుతిన్, కిమ్ మాస్కోలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యాకు ఉత్తర కొరియా సహకరిస్తున్నట్లు సమాచారం.
అయితే, ఉత్తర కొరియా మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. వ్యక్తిగతంగా కిమ్‌కు వాహనాలంటే చాలా ఇష్టమనే ప్రచారం ఉంది. ఆయన వద్ద అత్యంత విలాసవంతమైన కార్లు చాలా ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్‌లో రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు పుతిన్ కారు ఆరస్ సెనేట్ లిమోసిన్‌ను కిమ్ ఆసక్తిగా పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి.
న్ని గమనించి ఆయన్ని కారులో ఎక్కించుకుకొని స్వయంగా పుతిన్ డ్రైవ్ చేశారు. కిమ్ దగ్గర మెర్సిడెస్, రోల్స్ రాయిస్, మేబ్యాక్, లెక్సస్‌కు చెందిన పలు లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. అయితే, వీటిని ఉత్తర కొరియాకు ఎగుమతి చేయడంపై ఐరాస నిషేధం విధించింది. తాజాగా పుతిన్ కారు పంపడం సైతం ఆంక్షల ఉల్లంఘన కిందకే వస్తుందని పలువురు అంటున్నారు.