Telugu News » Kishan Reddy : రుణమాఫీ, డబుల్ బెడ్రూం పంపిణీ.. బీజేపీ పోరాట ఫలితమే!

Kishan Reddy : రుణమాఫీ, డబుల్ బెడ్రూం పంపిణీ.. బీజేపీ పోరాట ఫలితమే!

బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, వాటి డీఎన్ఏ ఒకటేనని ఆరోపించారు.

by admin
kishan reddy fire on cm kcr

కుటుంబ పాలనను తరిమికొట్టి.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) పిలుపునిచ్చారు. హైదరాబాద్ (Hyderabad) నుండి ఖమ్మం (Khammam) వెళ్తూ నకిరేకల్ లో సర్దార్ పాపన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భూములను పెద్దఎత్తున వేలం వేస్తూ ప్రైవేట్ సంస్థలకు కేసీఆర్ దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.

kishan reddy fire on cm kcr

ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్న కేసీఆర్ (KCR).. అధికారం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని అన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని.. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ (BRS) ఒక కూటమిగా ఏర్పడుతుందని కేటీఆర్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని ఆరోపించారు. రైతు రుణమాఫీ, డబుల్ బెడ్రూం పంపిణీ.. బీజేపీ పోరాట ఫలితమేనని చెప్పారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఢిల్లీలో కీలకపాత్ర పోషిస్తామని కేసీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవ చేశారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, వాటి డీఎన్ఏ ఒకటేనని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే మజ్లిస్ వారి‌ పంచన చేరి దోపిడీ చేస్తుందని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని వ్యాఖ్యానించారు.

కేంద్రంలో ప్రధాని మోడీ సారథ్యంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. అలాగే, తెలంగాణలో మార్పు రావాలంటే.. ఒక్క బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. అనంతరం ఆయన ఖమ్మం చేరుకున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కిషన్ రెడ్డి పూలమాల వేశారు. పార్టీ అధ్యక్షుడి రాకతో బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.

You may also like

Leave a Comment