త్వరలో పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో నేతలు విమర్శలతో తెరమీదికి వస్తున్నారు.. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై మాకు ఒక స్పష్టత ఉందని తెలిపారు. మోడీ (Modi) అభివృద్ధి లక్షాలే ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లో ప్రచారం ఉంటుందని అన్నారు.. కాంగ్రెస్ (Congress) అవినీతిని దేశం ఇంకా మర్చిపోలేదని విమర్శించారు..
ఎన్నికల్లో గెలవడం కోసమే కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక ఉచితాలు ఇచ్చిందని.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ నిలిచిందని ఆరోపణలు చేశారు.. మరోవైపు కేంద్రం 80 కోట్ల మందికి ఉచిత బియ్యం అందిస్తుందన్నారు. ఉజ్వల పథకం కింద పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించినట్లు పేర్కొన్నారు.. స్వచ్ఛ భారత్ పథకం కింద 12 కోట్ల ప్రజానీకానికి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు కిషన్ రెడ్డి వివరించారు.
మతంతో కులంతో, ప్రాంతంతో, భాషలతో సంబంధం లేకుండా కేంద్రం అన్ని సామాజిక వర్గాల ప్రజలకు సమానంగా సంక్షేమం అందిస్తుందని తెలిపారు. ఆయుష్మాన్ భవ పథకం కింద 70 కోట్ల మంది లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. కరెంట్ లేని గ్రామాలను గుర్తించి, యుద్ద ప్రాతిపాదికన విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.. 2014 లో 50 పర్సెంట్ మాత్రమే గ్రామాలకు రోడ్లు ఉండేవి.. కానీ నేడు 90 శాతం ప్రతి గ్రామానికి పక్కా రోడ్లు పూర్తి చేసినట్లు వివరించారు.. ప్రస్తుతం మోడీ సంస్కరణల వల్ల 22 గంటల విద్యుత్ అందుతుందని అన్నారు..
జన్ మన్ యోజన కింద 25 వేల కోట్లు ఆదివాసీల అభివృద్ధికి ఖర్చు చేసినట్లు తెలిపిన కిషన్ రెడ్డి.. డిజిటల్ ట్రాంజెక్షన్ దేశంలో ఒక నూతన మార్పును తీసుకొచ్చినట్లు వెల్లడించారు.. 2016 నుంచి 2024 వరకు 26,500 కోట్ల డిజిటల్ ట్రాంజెక్షన్స్ జరిగినట్లు వివరించారు.. ఒకప్పుడు GST ని కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా వ్యతిరేకించిందని.. కానీ నేడు.. GST వ్యాపారస్తులకు ఒక వరంలా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు..
మరోవైపు కార్పొరేట్ టాక్స్ 20 పర్సెంట్ ఉండేదని.. మోడీ వచ్చాక 15 పర్సెంట్ తగ్గించడం జరిగిందని తెలిపారు.. 12.5 నుంచి 5.1 వరకు ద్రవ్యోల్బణం తగ్గిందన్నారు. గతంలో బ్యాంకులకు 13 వేల కోట్ల ప్రాఫిట్ ఉంటే మోడీ పీఎం అయ్యాక కోటి 20 లక్షల కోట్ల బ్యాంకులకు ప్రాఫిట్ పెరిగిందని కిషన్ రెడ్డి వివరించారు.. పదేళ్లలో మహిళల ఎంపోవర్ మెంట్ కూడా పెరిగిందని అన్నారు..
28 కోట్ల మహిళలకు జనతదన్ ఖాతాలు ఓపెన్ చేయించామని.. 31 కోట్ల ముద్ర రుణాలు మహిళకు అందించామని తెలిపిన కిషన్ రెడ్డి.. ప్రభుత్వ పాఠశాలలో విద్య ప్రమాణాలు, మౌలిక వసతులు పెంచినట్లు తెలిపారు.. అయితే వాటిని మెయింటేన్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని విమర్శించారు.. అనాగరికమైన త్రిబుల్ తలాక్ ను రద్దు చేయడం వల్ల.. ఇవాళ ముస్లిం సమాజమే కాదు యావత్ దేశం మద్ధతు తెలిపిందన్నారు.
చట్ట సభల్లో 33 పర్సెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపామని వివరించారు.. చంద్రయాన్ 3 లో మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు.. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఖాదీనీ ప్రోత్సహించింది.. నేడు దేశంలో ఖాదీ వినియోగం విపరీతంగా పెరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు.. లక్ష ముప్పై కోట్ల ఖాదీ వినియోగం జరుగుతోందని అన్నారు.. టూరిజం బాగా అభివృద్ధి చేశాం..రికార్డు స్థాయిలో జాతీయ రహదారులు నిర్మాణం జరుగుతున్నాయన్నారు.
రైతాంగానికి పెద్ద పీట వేశామని వివరించిన కిషన్ రెడ్డి.. అగ్రికల్చర్ కు మూడువందల శాతం బడ్జెట్ పెంచామన్నారు. పాల ఉత్పత్తిలో దేశం అగ్రగామిగా ఉందని.. గతంలో 12 మెట్రిక్ టన్నుల ఫుడ్ ప్రాసింగ్ ఉండేది.. నేడు 4200 మెట్రిక్ టన్నుల వరకు ఫుడ్ ప్రాసెసింగ్ పెరిగిందన్నారు.. 8 కోట్ల మంది యువతకు ముద్ర రుణాలు అందించినట్లు తెలిపారు.. 7వందల పై చీలుకు విశ్వ విద్యాలయాల నుంచి 1113 విశ్వవిద్యాలయాలను పెంచుకున్నామన్నారు..