ఎస్సీ వర్గీకరణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ (SC Classification) సమస్యను ప్రధాని మోడీ అర్థం చేసుకున్నారని తెలిపారు. దశాబ్దాల నాటి సమస్యను మోడీ పరిష్కరిస్తున్నారని చెప్పారు. వర్గీకరణకు అనుకూలమని గతంలో కాంగ్రెస్ చెప్పిందన్నారు. కానీ ఆ విషయంలో ఏమీ చేయలేకపోయిందన్నారు.
ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ హామీ ఇవ్వగానే ప్రతిపక్షాలకు భయం పట్టుకుందన్నారు. ప్రధాని మోడీ తలుచుకుంటే ఎస్పీ వర్గీకరణ చేసి చూపిస్తారని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే ప్రధాని మోడీ ప్రయత్నమని పేర్కొన్నారు. ఎస్సీ వర్గరీకరణపై గతంలో ఎన్నో కమిటీలు వేశారని అన్నారు.
వర్గీకరణ అంశాన్ని గతంలో ఏ ప్రధాని కూడా సీరియస్ తీసుకోలేదన్నారు. వర్గీకరణ సమస్యను కాంగ్రెస్ ఏండ్ల తరబడి కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా వర్గీకరణపై ఇంత చిత్తశుద్దితో పనిచేయలేదని వెల్లడించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రథమ ముద్దాయి అని ఫైర్ అయ్యారు.
కొంతమంది రాజకీయ నాయకులు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు. వర్గీకరణ సమస్య పరిష్కారానికి బీజేపీ సంపూర్ణ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. న్యాయపరంగా..చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.