Telugu News » Kodandaram : ఆంధ్రా తీరు సరైంది కాదు.. కోదండరాం ఫైర్

Kodandaram : ఆంధ్రా తీరు సరైంది కాదు.. కోదండరాం ఫైర్

నాగార్జున సాగర్ నీటి వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు కోదండరాం. దీనిపై కేంద్ర జల సంఘానికి లేఖ రాస్తామని తెలిపారు. ఇక, ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన.. ప్రజలు వినూత్నమైన తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు.

by admin
kodandaram

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విడిపోయి పదేళ్లు అవుతున్నా.. ఇరు రాష్ట్రాల మధ్య చాలా పంచాయితీలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది నీళ్ల వాటా. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో అనేక చర్చలు, సమావేశాలు జరుగుతున్నాయి. తరచూ రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు కేంద్రానికి కంప్లయింట్ చేసుకోవడం కామన్ గా మారిపోయింది. తాజాగా నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) నీటి విడుదలకు సంబంధించి వివాదం నడుస్తోంది. దీనిపై ఇరు రాష్ట్రాలకు చెందిన నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

kodandaram

సాగర్ వివాదంపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (Kodandaram) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి వాటా అంశంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమైనదని అన్నారు. చట్టపరమైన విధానాలతో వెళ్లాలన్నారు. తమ నీటి వాటాను తాము వాడుకునేందుకు జగన్ ప్రభుత్వానికి హక్కు ఉంది కానీ, దానికి కొన్ని విధానాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఏపీ దుందుడుకు ఆలోచనలు సరైనవి కావని సూచించారు. ఇలాంటి చర్యలు మానుకొని చట్టపరంగా ముందుకు వెళ్లాలని కోరారు.

నాగార్జున సాగర్ నీటి వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు కోదండరాం. దీనిపై కేంద్ర జల సంఘానికి లేఖ రాస్తామని తెలిపారు. ఇక, ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన.. ప్రజలు వినూత్నమైన తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తాను మాట్లాడటం లేదని.. గ్రౌండ్ లెవల్లో తిరిగాను కాబట్టి చెబుతున్నానని తెలిపారు. 1970 ఎమర్జెన్సీ లో జరిగిన ఎన్నికలకు ఈసారి జరిగిన ఎన్నికలకు సారుప్యత ఉందన్నారు.

ప్రజలు ఈ ఎన్నికల్లో పాలకులపై పూర్తిగా వ్యతిరేకత కనబర్చారని చెప్పారు కోదండరాం. తెలంగాణ ఉద్యమ పౌరుషం ఎక్కడా తగ్గలేదని.. ఈ ఎన్నికల్లో స్పష్టంగా ప్రజల్లో కనినిపించిందని తెలిపారు. ఇలాంటి ఎన్నికలను చూడటం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పిన ఆయన.. సంపూర్ణ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని అంచనా వేశారు. నిరంకుశ పాలన రాకుండా చూసుకుంటామని, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కట్టుబడి ఉంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారని.. తాము దాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసమే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపామన్నారు కోదండరాం. ఇప్పటికైనా ప్రజల తీర్పును గుర్తించి పాలకులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడవద్దని సూచించారు.

You may also like

Leave a Comment