కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తన నియోజకవర్గ పనుల కోసం కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుంటారు. తాజాగా మరోసారి కేంద్రానికి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. FPCLలలో మౌలిక సదుపాయాల కోసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (Narendra Singh Tomar) కి లేఖ రాశారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నల్గొండ (Nalgonda) లో స్థాపించిన FPCLల కోసం నిధులు సమకూర్చాలని కోరారు.
నల్గొండ, మునుగోడు, నార్కెట్ పల్లి మండలాల్లో దేశ్ పాండే ఫౌండేషన్ తో కలిసి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ FPCLలను ఏర్పాటు చేసింది. వీటిని ప్రారంభించినప్పటి నుంచి వేలాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ఆయా ప్రాంతాలు వెనుబడినవి కావడంతో మౌలిక సదుపాయాల కోసం రైతులు కేంద్ర నిధులను కోరుతున్నారు. గోదాములు, కూరగాయల గ్రేడింగ్ షెడ్లు, సౌరశక్తితో పని చేసే కోల్ట్ స్టోరేజీ యూనిట్లు, ఇంటిగ్రేటెడ్ ప్యాకేజింగ్ షెడ్స్, ట్రాక్టర్లు, ఇలా ఇతర వ్యవసాయ నిర్మాణాల కోసం నాబార్డ్ నుంచి నిధులను FPCLలు కోరుతున్నాయి.
ఈ సదుపాయాలు కల్పిస్తే.. రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.. వారి ఉత్పత్తులు మార్కెట్ చేసుకోవడానికి వీలు ఉంటుందని అంటున్నారు కోమటిరెడ్డి. కాబట్టి, దీన్ని పరిగణనలోకి తీసుకుని FPCLలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు కాంగ్రెస్ ఎంపీ.