హైదరాబాద్(hyderabad) నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పని చేసిందని మంత్రి కేటీఆర్(ktr) అన్నారు. నగరంలో ఐటీ(it), ఐటీ అనుబంధ రంగాలు, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో భారీ పెట్టుబడుల(investments)ను ఆకర్షించేందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
మహారాష్ట్రకు చెందిన స్థిరాస్తి రంగ సంస్థల ప్రతినిధుల బృందం హైదరాబాద్ నగరానికి వచ్చింది. ఆ ప్రతినిధులతో టీ హబ్లో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, హైదరాబాద్ ప్రగతిపై ప్రతినిధులకు మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….
రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదట్లో పలు అనుమానాలు వుండే వన్నారు. వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ 10 ఏండ్ల అభివృద్ధిలో దూసుకు పోతున్నామన్నారు. ఐటీ ఎగుమతులతో పాటు ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో వుందన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతులతో పాటు పరిపాలన సంస్కరణలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు.
మౌలిక వసతుల కల్పనపై మనం ఎంత ఎక్కువ నిధులు ఖర్చు చేస్తే అభివృద్ధి అంత వేగంగా జరుగుతుందన్నారు. నగరంలో భారీగా మౌలిక వసతుల కల్పన చేపట్టి భవిష్యత్తు విస్తరణకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇప్పటికే తెలంగాణ విధానాలను, పథకాలను అధ్యయనం చేసేందుకు అనేక రాష్ట్రాలు ఇక్కడికి వచ్చాయన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా టీఎస్ ఐపాస్, భవన నిర్మాణాల అనుమతుల కోసం టీఎస్బీ పాస్ ప్రవేశపెట్టామన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్, తాగు నీటి సరఫరా వ్యవస్థలను రెడీ చేస్తున్నామన్నారు. 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేసే తొలి నగరంగా మారబోతున్నారని ప్రతినిధులతో వెల్లడించారు. ఎన్నడూ లేని విధంగా ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్ రెండేండ్లు వరసగగా దాటేసిందన్నారు.