Telugu News » KTR : కేయూ విద్యార్థులకు సారీ చెప్పిన కేటీఆర్

KTR : కేయూ విద్యార్థులకు సారీ చెప్పిన కేటీఆర్

ఆందోళనల సందర్భంగా పెట్టిన పోలీసు కేసులు ఎత్తి వేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. ఈ మేరకు వరంగల్ సీపీ రంగనాథ్ ను ఆదేశించారు. వారం రోజుల్లో పీహెచ్డీ ప్రవేశాల్లో అక్రమాలపై విచారణ చేయిస్తామని తెలిపారు.

by admin
KTR Strong counter to Pm modi

ఎట్టకేలకు కేయూ (KU) విద్యార్థుల ధర్నాపై సర్కార్ స్పందించింది. వరంగల్ (Warangal) పర్యటనలో కేయూ జేఏసీ (JAC) నేతల్ని కలిశారు మంత్రి కేటీఆర్ (KTR). 30 రోజులుగా పీహెచ్డీ కేటగిరీ-2 లో అక్రమాలు జరిగాయని నిరసన దీక్ష చేస్తున్నారు విద్యార్థులు. కేటీఆర్ ను కలిసిన సందర్భంగా అంతా ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులపై దాడి విషయంలో తమ తరఫున సారీ చెప్పారు మంత్రి.

Ktr strong counter to pm modi

ఆందోళనల సందర్భంగా పెట్టిన పోలీసు కేసులు ఎత్తి వేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. ఈ మేరకు వరంగల్ సీపీ రంగనాథ్ ను ఆదేశించారు. వారం రోజుల్లో పీహెచ్డీ ప్రవేశాల్లో అక్రమాలపై విచారణ చేయిస్తామని తెలిపారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వాకటి కరుణ సభ్యులుగా ఎంక్వైరీ కమిటీతో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

కేటీఆర్ విచారణ హామీపై వారం రోజులు వేచి చూస్తామని జేఏసీ నేతలు తెలిపారు. అప్పటికి న్యాయం జరగకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని స్పష్టం చేశారు.

కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ కేటగిరీ-2 అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ గత నెల 5 నుంచి విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. వీటికి ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. అంతకుముందు వరంగల్​ విద్యార్థులను, స్టూడెంట్ లీడర్లను పోలీసులు అరెస్టు​ చేశారు. ఈ క్రమంలో లాఠీలు ఝుళిపించడంతో విద్యార్థులకు గాయాలు కాగా.. అప్పటి నుంచి కేయూ క్యాంపస్ ​లో నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే.. సీపీ మాత్రం అప్పట్లో వారిని కొట్టలేదని ప్రకటించారు. తాజాగా ఇదే ఇష్యూకి సంబంధించి మంత్రి కేటీఆర్ క్షమాపణ కోరారు.

You may also like

Leave a Comment