ఇటీవల పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్(Congress) పార్టీ కండువా కప్పుకున్న ఖైరతాబాద్ బీఎఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Mla Danam Nagender) గులాబీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. గులాబీ బాస్(KCR) తీసుకున్న నిర్ణయం వల్లే తను పార్టీ మారాల్సి వచ్చిందని స్పష్టంచేశారు.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి, తప్పులను వెలికి తీయడం మొదలెట్టింది. బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని, దానిపై విచారణకు ఆదేశించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో గులాబీ లీడర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. దీంతో ఒక్కొక్కరుగా నేతలు పార్టీని వీడటం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే కారు గుర్తుపై గెలిచి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం.. బీఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి కేటీఆర్‌పై సంచలన కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలయ్యాక బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) పొత్తు పెట్టుకుని(Tied Up) కలిసి పనిచేస్తాయని కేటీఆర్ చెప్పాడని దానం ఆరోపించారు.
దానిని నేను వ్యతిరేకించానని, బీజేపీతో కలిసి పనిచేస్తే బీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ ఎలా అవుతుందని తాను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో గులాబీ బాస్ నిర్ణయం నచ్చకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు దానం నాగేందర్ చెప్పడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నారు.