Telugu News » KTR : పీఎం గారూ.. ఈ మూడు హామీల సంగతేంటి..?

KTR : పీఎం గారూ.. ఈ మూడు హామీల సంగతేంటి..?

మోడీ పదేళ్ల పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారని ఆరోపించారు.

by admin
Ktr tweet: Think farmers.. What do we want?: Minister KTR

ప్రధాని మోడీ (PM Modi) వరుస తెలంగాణ (Telangana) పర్యటనల నేపథ్యంలో ట్విట్టర్(ఎక్స్)లో మంత్రి కేటీఆర్ (KTR) ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు?, బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు? పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు? అంటూ నిలదీశారు. మూడురోజుల వ్యవధిలో రెండు పర్యటనలు పెట్టుకున్నారు.. మరి.. ఈ మూడు విభజన హక్కులకు దిక్కేది? అని ప్రశ్నించారు.

Ktr Fire on Pm modi

‘‘ పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర? మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు? మీ గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా? కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారు.. లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్ ను ఆగం చేశారు. మా ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారు. దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారు’’ అంటూ విమర్శల దాడి చేశారు కేటీఆర్.

మోడీ పదేళ్ల పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారని ఆరోపించారు. 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ చేస్తానన్నారు.. దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు అన్నారు.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పారు.. పెట్రోల్ ధరలు నియంత్రిస్తామని హామీ ఇచ్చారు.. మరి, ఏమైందని నిలదీశారు కేటీఆర్. ‘‘మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా? అని ప్రధానిని కడిగిపారేశారు.

పసుపు బోర్డు ప్రకటన కూడా మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉందన్న మంత్రి.. ఎన్నికల వేళ హంగామా చేసి.. అది ఎప్పటికి అమలు చేస్తారో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ప్రధానిగా మోడీ పదేళ్ల పాలనలో అదానీకి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటని అడిగారు. తెలంగాణకు ఇచ్చిన మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అనం జోస్యం చెప్పారు. మళ్లీ వంద స్థానాల్లో మీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ అంటూ విమర్శించారు మంత్రి కేటీఆర్.

You may also like

Leave a Comment