Telugu News » Two Thousand Notes : రూ. 2 వేల నోట్ల మార్పిడి గడువు పొడిగింపు…..!

Two Thousand Notes : రూ. 2 వేల నోట్ల మార్పిడి గడువు పొడిగింపు…..!

ఈ క్రమంలో తాజాగా గడువును మరోసారి పెంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.

by Ramu
Last date to exchange Rs 2000 bank notes extended by RBI

2వేల రూపాయల నోట్ల (Two thousan Rupees Notes) ను మార్చుకునేందుకు తుది గడువును (Last Date) ఆర్బీఐ (RBI) పొడిగించింది. ఈ నెల 7 వరకు ప్రజలు బ్యాంకు (Banks) ల్లో 2 వేల రూపాయల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. అంతకు ముందు రూ. 2 వేల రూపాయల నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30ని చివరి తేదీగా ఆర్బీఐ ప్రకటించింది.

Last date to exchange Rs 2000 bank notes extended by RBI

ఆర్బీఐ ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలో తాజాగా గడువును మరోసారి పెంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 7లోగా ప్రజలు 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల వద్ద మార్పుకోవాలని సూచించింది. ఈ నెల 8 నుంచి బ్యాంకులు రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోబోవని పేర్కొంది. అయినప్పటికీ రూ. 2 వేల రూపాయలు చట్టబద్ధంగా చలామణి అవుతాయని వివరించింది.

ఈ నెల 8 తర్వాత ప్రజలు ఆర్బీఐకి చెందిన 19 కార్యాలయాల్లో ఈ నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. ఒక కస్టమర్ గరిష్టంగా రూ. 20 వేలు విలువ చేసే రూ. 2 వేల నోట్లను మార్చు కోవచ్చని ఆర్బీఐ చెప్పింది. ఆర్బీఐ ద్వారా మార్చుకున్న ఈ నోట్లను కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ చేస్తామని స్పష్టంచేసింది. ఇండియా పోస్టు ద్వారా కూడా ఆర్బీఐ కార్యాలయానికి నోట్లు పంపవచ్చని తెలిపింది.

మే 19 నాటికి 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2 వేల నోట్లు చలామణిలో వున్నాయని ఆర్బీ ఐ తెలిపింది. అందులో 3.42 లక్షల కోట్లు ఇప్పటికే బ్యాంకుల్లోకి చేరినట్టు ఆర్బీఐ వివరించింది. సెప్టెంబర్ 29 నాటికి కేవలం 0.14 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు మాత్రమే చలామణిలో వున్నాయని తెలిపింది.

 

You may also like

Leave a Comment