అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు (wild animals) జనారణ్యం లోకి వస్తున్నాయి. ఇలా గత కొంత కాలంగా జరుగుతుంది. అడవులు అంతరించిపోవడం.. వన్య ప్రాణులకు ఆహారం దొరకడం కష్టంగా మారడం వంటి పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుందని ఇప్పటికే జంతు ప్రేమికులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే వివిధ ప్రదేశాల్లో వన్య మృగాలా దాడిలో ప్రజలు ప్రాణాలను కోల్పోయిన ఘటనలు తరచుగా వెలుగులోకి రావడం తెలిసిందే.
మరోపైపు మహారాష్ట్రలో ఓ చిరుత పులి జనం మధ్య లోకి వచ్చి కలకలం సృష్టించింది. మహారాష్ట్ర (Maharashtra) కళ్యాణ్-ముర్బాద్ ( Kalyan-Murbad Road)రోడ్.. వరప్ గ్రామ సమీపంలో ఉన్న టాటా పవర్ కాంప్లెక్స్ (Tata Power Complex) కంపెనీ ఆవరణలో చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరా లో రికార్డు అయ్యాయి.
ఈ విషయం తెలిసిన కంపెనీ ఉద్యోగులు భయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో చిరుత సంచారం గురించి అటవీశాఖ అధికారులకు, కంపెనీ ఉద్యోగులు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. చిరుత కోసం గాలించారు. అనంతరం చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు..
చిరుత దారి తప్పి ఈ ప్రాంతానికి వచ్చిందని అధికారులు తెలిపారు. మరోవైపు కళ్యాణ్-ముర్బాద్ రోడ్ లో ఉన్న వరప్ గ్రామ వాసులు, టాటా పవర్ కంపెనీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లవద్దని కోరారు. ప్రస్తుతం చిరుత సంచారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.