Telugu News » Lok sabha elections : లోక్‌సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్.. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

Lok sabha elections : లోక్‌సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్.. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

పార్లమెంట్ ఎన్నికలు(parliament elections) త్వరలో జరగనున్న నేపథ్యంలో తొలి దశ (First phase) ఎన్నికకు సంబంధించి బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

by Sai
Lok Sabha Elections First Phase Notification Release.. Acceptance of Nominations Begin

పార్లమెంట్ ఎన్నికలు(parliament elections) త్వరలో జరగనున్న నేపథ్యంలో తొలి దశ (First phase) ఎన్నికకు సంబంధించి బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్రంఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ కూడా విడుదల చేసింది.

Lok Sabha Elections First Phase Notification Release.. Acceptance of Nominations Begin

తొలి దశలో 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు నోటిఫికేషన్ విడుదలవ్వగా.. నేటి(బుధవారం) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 27న ఆఖరు తేదీ. 28న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉండగా..30వ తేదీన ఉపసంహరణకు ఎన్నికల సంఘం అవకాశం ఇస్తుంది.

ఇక వచ్చే నెల 19న జరగనున్న తొలి దశ ఎన్నికల్లో తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత రాజస్థాన్‌లో 25 స్థానాలకు గాను 12 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక దేశంలోనే అత్యధికంగా 80 ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో తొలిదశలో 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

వీటితో పాటే మధ్యప్రదేశ్‌లో 6 స్థానాలు, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ ‌లలో చెరో 5 స్థానాలు, బిహార్‌లో 4, బెంగాల్‌లో 3, అరుణాచల్ ప్రదేశ్‌‌, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్ముకాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి‌లో ఒక్కో లోక్‌‌సభ స్థానంలో పోలింగ్ జరగనుంది. అనంతరం రెండో దశ పోలింగ్‌కు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

You may also like

Leave a Comment