దేశంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు 75 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేశాయి.. ఎటుచూసినా డబ్బు, మద్యం ఏరులై ప్రవహించడం కనిపిస్తుంది. ఎన్నికల వేళ పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసిన ఈసీ (EC).. భారీగా నగదు జప్తు చేస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి రోజుకు రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను సీజ్ ప్రకటించింది. ఇంకా పోలింగ్ సమయం ఉండగానే ఇప్పటికే రూ.4,650 కోట్లు జప్తు చేసినట్లు తెలిపింది.
పోలింగ్ తేదీలు సమీపించే కొద్దీ ఈ నగదు ప్రవాహం మరింత ఎక్కువ కానుందనే అంచనాకు వచ్చారు.. ఇదిలా ఉండగా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జప్తు చేసిన దానికంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం.. 75 ఏళ్ల సార్వత్రిక ఎన్నికల చరిత్రలో ఈసారే రికార్డుస్థాయిలో నగదు జప్తు జరిగిందని ఈసీ పేర్కొంది. ఇక ఏడు విడతల్లో పోలింగ్ ముగిసే సమయానికి ఈ జప్తులు ఏ స్థాయికు చేరుతాయో ఊహకు అందని విషయంగా తెలిపింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఏడు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, పోలీసులు నగదు ప్రవాహంపై దృష్టి సారించారు.. తనిఖీలను కట్టుదిట్టంగా చేపట్టారు.. ఈ నేపథ్యంలో జప్తులకు సంబంధించి వందల సంఖ్యలో కేసులు ఇప్పటికే నమోదు చేశారు..
మరోవైపు భారత ఎన్నికల సంఘం బెంగాల్ (Bengal)లోని ముర్షిదాబాద్ (Murshidabad) డీఐజీని తొలగించాలని ఆదేశించింది. హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు స్పందించలేదని.. వాటిని నివారించడానికి చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ.. ఆదేశాలు జారీ చేసింది. అలాగే రెండు హింస్మాతక ఘటనలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉపయోగించిన ట్లు ఈసీ వివరించింది..