Telugu News » Lok Sabha Elections : రాష్ట్రంలో ఉద్యమాల పార్టీ ఊపిరి ఆగిపోతుందా..?

Lok Sabha Elections : రాష్ట్రంలో ఉద్యమాల పార్టీ ఊపిరి ఆగిపోతుందా..?

ఒకప్పుడు చోటు లేకుండా ఉన్న పార్టీలో ఇప్పుడు లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలోని 17 స్థానాలలో నిలబడేందుకు అభ్యర్థులే దొరకని దయనీయ స్థితికి దిగజారిపోవడం నాయకత్వ లోపంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

by Venu
BRS

తెలంగాణ (Telangana) లో బీఆర్ఎస్ (BRS) మనుగడపై విభిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. అడ్డదారుల్లో అధికారం చేచిక్కించుకోవాలనే తాపత్రయంలో ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. చివరికి దిక్కులేక బీఎస్పీ తో పొత్తువరకు వెళ్ళిన గులాబీ భవిష్యత్తు లోక్ సభ ఎన్నికల తర్వాత గల్లంతు అవుతుందనే విమర్శలు జోరుగా రాజకీయాల్లో నడుస్తున్నాయి.. ఇది వరకు ఉన్నంత జోరు.. జోష్ ప్రస్తుతం కారులో లేదనే అభిప్రాయాలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి.

ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం బీఆర్ఎస్ వ్యవహారం ఉండటం పలు అనుమానాలకు కారణం అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా అధికారంలో ఉన్నంత కాలం కంటి చూపుతో రాష్ట్ర రాజకీయాలను శాసించిన కేసీఆర్.. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం తన పార్టీ నేతలను, క్యాడర్ ను కూడా కదిలించలేకపోతున్నారనే వార్తలు జోరందుకొన్నాయి.. ఇప్పటికే కారు దిగుతున్న నేతలు ఒకవైపు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పై జరుగుతున్న ప్రచారాలు.. రాజకీయాలపై ఆసక్తి ఉండి లేనట్టుగా ప్రవర్తిస్తున్న కేసీఆర్ (KCR) వ్యవహారం ఉన్న కొద్ది మంది పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు.

విజయాలు అందినప్పుడు ఒకలా ఉన్న గులాబీ బాస్.. ఒక్క ఓటమితో పార్టీపై పూర్తిగా పట్టు కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరాజయం పాలైన మూడు నెలలలోనే బీఆర్ఎస్ అస్థిత్వమే ప్రశ్నార్ధకంగా మారిన పరిస్ధితులు నెలకొన్నాయని అంటున్నారు. ఓటమి నుంచి తేరుకుని లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) సమాయత్తం కావాల్సిన తరుణంలో పార్టీలో వలసలు ఆ పార్టీ అగ్రనాయకత్వం నిస్సహాయ స్థితికి అద్దం పడుతున్నాయని అనుకొంటున్నారు..

ఒకప్పుడు చోటు లేకుండా ఉన్న పార్టీలో ఇప్పుడు లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలోని 17 స్థానాలలో నిలబడేందుకు అభ్యర్థులే దొరకని దయనీయ స్థితికి దిగజారిపోవడం నాయకత్వ లోపంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకే అధినేత దర్శనం దుర్లభంగా మారింది. అప్పటి ఫలితం ఇప్పుడు 70 mm లో కనిపిస్తుందని అనుకొంటున్నారు..

ఇక సిట్టింగ్ ఎంపీలు కూడా ఎన్నికల ముంగిట పార్టీని వీడుతున్నారంటే.. ఆ పార్టలో ఉండి పోటీ చేస్తే గెలిచే పరిస్థితులు లేవన్నది స్పష్టంగా తెలుస్తోందని భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం డిఫాక్టో సీఎంగా వ్యవహరించిన కేటీఆర్ (KTR), పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీష్ రావు (Harish Rao) వంటి నేతలు కూడా ప్రస్తుతం పార్టీ వ్యవహారాలలో పెద్దగా జోక్యం చేసుకోకుండా, కేవలం ప్రకటనలు, విమర్శలకు పరిమితమౌతుండటం చూస్తుంటే.. గులాబీ తోట వాడిపోవడానికి సిద్దమైందనే సంకేతాలుగా భావిస్తున్నారని తెలుస్తోంది.

You may also like

Leave a Comment