త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మాటల వార్ జోరుగా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతలు వేడి పుట్టేలా విమర్శలు గుప్పించుకొంటున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీమంత్రి కేటీఆర్ ప్రభుత్వం విధానాలపై ఘాటుగా స్పందిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి..
బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తుండగా.. సాక్ష్యాలు ఉంటే నిరూపించండని గులాబీ ముఖ్యనేతలు సవాల్ విసురుతున్నారు.. ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కీలక రిక్వెస్ట్ చేశారు. షెడ్యూల్ కులానికి చెందిన ఓ నెటిజన్ యూఎస్ఏలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నానని.. అంబేద్కర్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ గతంలో పొందానని తెలిపినట్లు వెల్లడించారు.
అయితే కాలేజీ ఫీజు కట్టేందుకు సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నానని కేటీఆర్ (KTR)కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఈ అంశంపై స్పందించారు. అంబేద్కర్ ఓవర్ సీస్ స్కాలర్‌షిప్ (Ambedkar Overseas Scholarship) రెండవ ఇన్ స్టాల్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)ను కోరారు.
తెలంగాణలోని 7వేలకు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ బ్యాక్ గ్రౌండ్ విద్యార్థులు కేసీఆర్ ప్రభుత్వంలో ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ పొందారని ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు శుక్రవారం బీఆర్ఎస్ తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి పోటీగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ప్రజా సంఘాలతో కలిసి రేపు ఉదయం మేడిగడ్డను సందర్శించనునట్లు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రఘుమారెడ్డి తెలిపారు.