భగవాన్ శ్రీ రాముడు మన చరిత్ర (Our History) అని, మన వారసత్వం, మన సంస్కృతి( Culture)కి ప్రతీక అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitini Gadkari) అన్నారు. అయోధ్యలో రామ్ లల్ల ఆలయాన్ని ప్రారంభించడం అనేది అతి పెద్ద విజయం అని ఆయన అభివర్ణించారు.
అయోధ్యలో రామాలయం ప్రారంభించడం అనేది మన జీవితంలో అతి పెద్ద విజయమని అన్నారు. ఆ చరిత్రను మనం మరిచిపోలేమన్నారు. అయోధ్య రామాలయం ఉద్యమంలో తాను పాల్గొన్నానని గుర్తు చేశారు. ఈ ఉద్యమంలో తాను జైలుకు కూడా వెళ్లానని ఆయన గుర్తు చేశారు.
రామాలయం కోసం వేలాది మంది సత్యాగ్రహం చేశారన్నారు. అది ఒక సుదీర్ఘమైన ఉద్యమమన్నారు. శ్రీ రామ చంద్రుడు మన చరిత్ర అన్నారు. మన సంస్కృతికి ప్రతీక అని వెల్లడించారు. రామ చంద్రుని జన్మస్థలంలోనే ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఇంత కన్నా భారతీయులకు సంతోషకరమైన విషయం ఏముంటుందన్నారు.
భారతీయులంటే కేవలం హిందువులు మాత్రమే కాదన్నారు. ఈ దేశ సంస్కృతిని, వారసత్వాన్ని, సాంప్రదాయాలను పాటించే వారంతా భారతీయులేనన్నారు. మతాలతో సంబంధం లేకుండా అందరూ రామాలయ నిర్మాణం పట్ల చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.