Telugu News » Los Angeles: ఆస్కార్ వేడుకల్లో నిరసన సెగ.. కాల్పుల విరమణకు డిమాండ్..!

Los Angeles: ఆస్కార్ వేడుకల్లో నిరసన సెగ.. కాల్పుల విరమణకు డిమాండ్..!

ఇజ్రాయెల్‌ హమాస్(Israel-Hamas) మధ్య కాల్పుల విరమణ డిమాండ్‌కు మద్దతివ్వాలని కోరుతూ పలువురు ఆందోళనకారులు నిరసన తెలిపారు.

by Mano
Los Angeles: Protest continues at the Oscars.. Demand for ceasefire..!

ఆస్కార్(Oscar) వేడుక ప్రాంగణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌ హమాస్(Israel-Hamas) మధ్య కాల్పుల విరమణ డిమాండ్‌కు మద్దతివ్వాలని కోరుతూ పలువురు ఆందోళనకారులు నిరసన తెలిపారు. దీంతో లాస్​ఏంజిల్స్(Los Angeles)​లోని డాల్బీ థియేటర్​ వద్ద ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Los Angeles: Protest continues at the Oscars.. Demand for ceasefire..!

నిరసనలతో పలువురు ప్రముఖులు అస్కార్​ వేడుకల కార్యక్రమానికి ఆలస్యంగా హాజరయ్యారు. నిరసనలపై ముందస్తు సమాచారం అందుకున్న లాస్‌ ఏంజిల్స్‌ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకల చుట్టుపక్క ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అంతలోనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమకు మద్దతుగా నిలవాలని అక్కడికి వచ్చే ప్రముఖులను కోరారు.

మరోవైపు ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్ దక్కించుకున్న బిల్లీ ఇలిష్‌, ఫినియాస్‌ గాజాకు మద్దతిస్తూ ప్రత్యేక బ్యాడ్జీని ధరించడం గమనార్హం. మరికొందరు ప్రముఖులూ వీరి బాటలోనే గాజాకు మద్దతుగా నిలిచారు. అటు కాల్పుల విరమణకు అమెరికా కృషి చేస్తోందని అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. హమాస్‌పై పోరు విషయంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు.

ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కొనసాగుతుందని బైడెన్​ చెప్పడం గమనార్హం. ఆ దేశ రక్షణ, అక్కడి పౌరుల భద్రత చాలా కీలకమని వ్యాఖ్యానించారు. తన అభిప్రాయాన్ని నేరుగా ఇజ్రాయెల్‌ వెళ్లి అక్కడి పార్లమెంటుకే తెలియజేయాలనుకుంటున్నానని బైడెన్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆయుధాలను అందించటం, ఐరన్‌ డోమ్‌ వ్యవస్థకు మద్దతివ్వటం వంటి విషయాల్లో రాజీ ఉండదని స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment