అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలలో భాగంగా రూ.500కి గ్యాస్ సిలిండర్ (Gas Cylinder), 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు నేటితో ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మహిలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను నేడు ప్రభుత్వం విడుదల చేసింది.. తెల్లరేషన్ కార్డు (White Ration Card) ఉన్నవాళ్లకు మాత్రమే ఈ పథకం వర్తింస్తుందని పేర్కొంది. ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకొన్నవారు అర్హులుగా నిర్ణయించింది.
మరోవైపు రూ.500కి గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా కీలక సూచనలు చేసింది. మహిళా పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) వర్తిస్తుందని తెలిపింది. అదీగాక గత మూడేళ్ల సిలిండర్ల వినియోగాన్ని పరిగణలోకి తీసుకోనుంది. మరోవైపు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీంకి సంబంధించిన జీవోను ప్రభుత్వం నేడు జారీ చేసింది. ఈమేరకు ప్రజాపాలనలో సబ్సిడీ సిలిండర్ కోసం అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా ఎంపిక చేసిన 39.5 లక్షల లబ్ధిదారులకు ప్రస్తుతం ఈ పథకం వర్తించనుందని వెల్లడించింది.
ముందుగా గ్యాస్ వినియోగదారులు మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాలని తెలిపింది. తర్వాత వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయనున్నట్లు తెలిపింది. అదీగాక భవిష్యత్తులో ఈ విధానంలో మార్పు తీసుకు రావడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వినియోగదారుల అకౌంట్ లోకి సబ్సిడీ అమౌంట్ 48 గంటల్లోనే ట్రాన్స్ఫర్ కానుందని తెలిపింది.
ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు సంబంధించిన విధానాలపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు చర్చించుకొంటున్నారు. మహాలక్ష్మి పథకం గైడ్లైన్స్ విడుదల చేయడంతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే మహిళల పేరు మీద లేని గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు మార్చుకొంటే.. మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా? లేదా? అనే డైలమాలో జనం ఉన్నట్లు తెలుస్తోంది.