భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కర్ ( Jagdeep Dhankhar )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత శతాబ్దంలో మహ్మాత్మ గాంధీ (Mahatma Gandhi) ‘మహాపురుషుడు’అని అన్నారు. ఈ శతాబ్దంలో ప్రధాని మోడీ (PM Modi) ‘యుగపురుషుడు’(Yuga Purush)అని అభివర్ణించారు.
జైన ఆధ్మాత్మిక వేత్త, తత్వవేత్త శ్రీమద్ రామచంద్రాజీ జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ధన్కర్ మాట్లాడుతూ…. సత్యాగ్రహం, అహింసల ద్వారా మహాత్మ గాంధీ మనకు బ్రిటీష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించారన్నారు. అటు మనం ఏ మార్గంలోనైతే నడువాలని అనుకుంటున్నామో మనలను అదే మార్గంలో ప్రధాని మోడీ నడిపిస్తున్నారని తెలిపారు.
మహాత్మగాంధీకి, ప్రధాని మోడీకి మధ్య ఒక సారుప్యత ఉందని చెప్పారు. ఆ ఇద్దరు కూడా శ్రీమద్ రామ చంద్రాజీని చాలా గౌరవిస్తారని పేర్కొన్నారు. దేశం అభివృద్ధిని సహించని శక్తులు, దేశ ఎదుగుదలను జీర్ణించుకోలేని దుష్ట సమూహాలు ఏకమవుతున్నాయని అన్నారు. దేశంలో మంచి జరిగే సమయంలో ఆ శక్తులు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయన్నారు.
అలాంటివి జరగకూడదన్నారు. మన ముందు పెద్ద పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. మన పక్కన ఉన్న దేశాల చరిత్ర చాలా చిన్నదన్నారు. వాళ్లది కేవలం 300 ఏండ్ల లేదా 500 ఏండ్ల లేదా 700 ఏండ్ల చరిత్ర మాత్రమేనన్నారు. కానీ భారత్ కు ఐదు వేల ఏండ్ల నాటి చరిత్ర ఉందని వివరించారు.