తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress)అంటే ఈ పార్టీలో ఎవరికి వారే లీడర్ అనే అభిప్రాయం ప్రజల్లో ఉందనే విషయం తెలిసిందే.. అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ తలనొప్పిగా మారి పార్టీ ఎదుగుదలకు అవరోధంగా మారాయని భావించిన అధిష్టానం ఇప్పటి వరకు నేతలకు సీరియస్ వార్నింగ్ లు ఇచ్చి కోటలు దాటుతున్న వారి మాటలకు అడ్డుకట్ట వేసిందనే ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో ఒకప్పుడు దూకుడుగా వ్యవహరించిన కొందరు నేతలు ప్రస్తుతం సైలెంట్ మోడ్ లో ఉంటటం కనిపిస్తుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎంపీ సీటు కోసం ఫైట్ టఫ్ గా ఉన్నట్ల గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎలాగో అధికార పార్టీ.. గెలుపు సునాయాసంగా ఉంటుందని భావించిన నేతలు.. వారి కుటుంబీకులను, సన్నిహితులను బరిలోకి దింపే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇదే సమయంలో ఎంపీ సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్లో అసమ్మతి రాగం సెగలు కక్కుతోంది. లోక్ సభ ఎన్నికల్లో గెలిచి తిరుగు లేకుండా ఎదుగుదామని భావిస్తున్న హస్తానికి ఈ పరిణామం మింగుడుపడని రాయిలా మారిందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ లైన్ దాటుతున్న నేతలపై సీరియస్ అయింది.
ఈమేరకు పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేసింది. తాజాగా ఇలాంటి నేతల విషయంలో ఎమ్మెల్సీ (MLC), టీపీసీసీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు..
ఏమైనా బేధాభిప్రాయాలు.. సూచనలు ఉంటే అంతర్గతంగా తెలియజేయాలని నేతలను కోరారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి ఎవరు మాట్లాడిన ఎంత సీనియర్ అయిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. కాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అంశాలపై వీహెచ్ హన్మంతరావు, నిరంజన్ బహిరంగంగా మాట్లాడిన సంగతి ఏరిగిందే..